జగన్‌ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు - ఇదీ కారణం..!!

ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. ఇంకా 14 నెలల సమయం ఉండగానే పార్టీలు ఎన్నికలకు సిద్దం అవుతున్నాయి. మరోసారి అధికారం పై వైసీపీ ధీమా వ్యక్తం చేస్తుంటే..తమదే అధికారం అని టీడీపీ చెబుతోంది. ఇదే సమయంలో సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. జగన్ పాలన లో ప్రతీ కుటుంబం సంతోషంగా ఉందని చెప్పారు. ప్రతీ ఇంటికి సంక్షేమం అందుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు కుప్పంలో చెక్ పెట్టాలని పెద్దిరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతీ నెలా కుప్పంలో పార్టీ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. చేరికలను ప్రోత్సహిస్తున్నారు.

తాజాగా మంత్రి పెద్దిరెడ్డి పర్యవేక్షిస్తునన అటవీ శాఖ ప్రధాన కార్యాలయాన్ని మంగళగిరిలో ప్రారంభించారు. ప్రత్యేక పూజలు చేసారు. రాష్ట్రంలో ఇంత గొప్ప పాలన ఎప్పుడూ చూడలేదన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేస్తున్న విమర్శలను ప్రజలు పట్టించుకోవటం లేదని చెప్పుకొచ్చారు. ఎవరు తప్పుడు ప్రచారం చేుసినా ప్రజల మద్దతు జగన్ కు ఉందని చెప్పారు. మరోసారి ముఖ్యమంత్రి గా జగన్ పగ్గాలు చేపడతారని మంత్రి పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేసారు. టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు చేస్తున్న వ్యాఖ్యల పైనా మంత్రి పెద్దిరెడ్డి సీరియస్ అయ్యారు. ఇప్పటికే కుప్పం నియోజకవర్గంలో పెద్దిరెడ్డి ప్రత్యేక ఫోకస్ పెట్టగా..తాజాగా ఆయన తనయుడు ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఎంట్రీ ఇచ్చారు.

Minister Peddireddy interesting comments on 2024 Election Results, Fires on Chandra Babu

కుప్పంలో దొంగ ఓట్లు ఉన్నాయంటూ ఆయన ఎన్నికల సంఘానికి ఫిర్యాదుకు సిద్దమయ్యారు. అటు చంద్రబాబు కూడా మంత్రి పెద్దిరెడ్డి పైన తీవ్ర వ్యాఖ్యలతో ఫైర్ అవుతున్నారు. పుంగనూరులో పెద్దిరెడ్డి ఎలా గెలుస్తారో చూస్తానంటూ సవాల్ చేసారు. దీనికి స్పందనగా తాను కుప్పం..పుంగనూరు రెండో చోట్ల పోటీకి సిద్దమని.. చంద్రబాబు సిద్దమా అంటూ పెద్దిరెడ్డి ఛాలెంజ్ చేసారు. వచ్చే ఎన్నికల్లో కీలకమైన కుప్పంతో పాటుగా అనంతపురం జిల్లా బాధ్యతలను సీఎం జగన్ మంత్రి పెద్దిరెడ్డికి అప్పగించారు. ఎంపీ మిథున్ రెడ్డికి గోదావరి జిల్లాల బాధ్యతలను సీఎం కేటాయించారు. తండ్రీ..కుమారులు ఇద్దరూ 48 అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. 2024లో వైసీపీ తిరిగి అధికారంలోకి రావాలంటే ఈ సీట్లు కీలకం కానున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+