గుండెల నిండా టీడీపీ, మససు నిండా చంద్రబాబు..! : పవన్ కల్యాణ్‌కు పేర్ని నాని కౌంట‌ర్

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన విమర్శలకు మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర చరిత్రలో నూతన అధ్యాయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాంది పలికారని కొనియాడారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు చేయలేని పనిని కేవలం మూడేళ్ల పాలన అనుభవం ఉన్న జగన్ చేసి చూపించారని చెప్పారు. పరిపాలన సౌలభ్యం కోసం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవడం గొప్ప విషయమన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి పార్లమెంటు నియోజక వర్గాన్ని ఒక జిల్లాగా మార్చారని స్పష్టం చేశారు.

1చంద్ర‌బాబు చేయ‌లేని ప‌ని జ‌గ‌న్ చేశారు..

1చంద్ర‌బాబు చేయ‌లేని ప‌ని జ‌గ‌న్ చేశారు..

ఎన్నికల సమయంలో జగన్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారని మంత్రి పేర్ని నాని తెలిపారు. కోతలు కూయడంలో చంద్రబాబు దిట్టని విమర్శించారు. తన హయాంలో కనీసం కుప్పంను కూడా రెవెన్యూ డివిజన్ చేసుకోలేక పోయిన అసమర్ధుడు అని దుయ్యబట్టారు. ఆయన నలబై ఏళ్ల రాజకీయ జీవితం ఏమైందని ప్రశ్నించారు. చివరకు జగన్ వద్ద కుప్పంను రెవెన్యూ డివిజన్ చేయాలని అభ్యర్థించే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. నాడు టీడీపీ పాలనలో ప్రభుత్వ పాఠశాలలు మూతబడే స్థాయిలో ఉంటే జగన్ వచ్చాక వాటి రూపురేఖలు మార్చారని చెప్పారు. నేడు ఆ పాఠశాల్లో సీట్లు లేవని బోర్డులు పెట్టే స్థాయికి తీసుకువచ్చారని ప్రశంసించారు.

 బాబు తానా అంటే పవన్ కల్యాణ్ తందానా..

బాబు తానా అంటే పవన్ కల్యాణ్ తందానా..


రాష్ట్ర రాజకీయాలు, చరిత్ర గురించి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ కు ఎలాంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి పేర్నినాని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తానా అంటే పవన్ తందాన అనే వ్యక్తి అని విమర్శించారు. ఏలూరు జిల్లాలోనే కొక్కనూరు ఉంటే కనీస అవగాహన లేకుండా విమర్శించడం తగదన్నారు. చంద్రబాబు సలహాలతో పవన్ లేఖలు రాస్తున్నారని సైటైర్లు విసిరారు. ఇంత కాలం ఎక్కడ ఉన్నారని నీలదీశారు. తమది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుస్తున్న ప్రభుత్వమని తేల్చిచెప్పారు.

3. మంచి చెప్ప‌డం చేత‌కాకపోతే నోటికి తాళం.!

3. మంచి చెప్ప‌డం చేత‌కాకపోతే నోటికి తాళం.!

రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని విమర్శంచడం మాని సూచనలు, సలహాలు ఇవ్వాలని పవన్ కల్యాణ్‌కు పేర్నినాని హితవు పలికారు. ప్రభుత్వం మంచి చేస్తున్నప్పుడు మంచి అని చెప్పడం చేతకొకపోతే.. నోటికి తాళం వేసుకోండి అంటూ విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కోసం అవసరమైతే నాలుగు మెట్లు దిగి పరిష్కరించే వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అని కొనియాడారు. కమ్యూనిస్టు పార్టీ నేతలు నారాయణ, రామకృష్ణ కూడా తమ ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. వారికి గుండెల నిండా టీడీపీ , మససు నిండా చంద్రబాబు ఉన్నారని విమర్శించారు. రంపచోడవరం, పోలవరం వంటి ప్రాంతాల్లో ప్రజల సమస్యలపై జగన్ దృష్టి పెట్టారని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+