జగన్ బురద రాజకీయం
గుంటూరు: వరద బాధితులను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఆదుకుంటే వైసిపి అధినేత జగన్ బురద రాజకీయాలు చేయడం విడ్డూరమని మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. దాచేపల్లిలో పంటలు మునిగిపోవడానికి వైసిపి గుత్తేదారులే కారణమన్నారు. అక్కడ జగన్ అడుగు పెడితే మహిళలు నిలదీస్తారన్నారు. వరద బాధితులను ఆదుకోవాలని కనీసం పార్టీ నేతలను ఆదేశించలేని జగన్‌కు సీఎంను విమర్శించే హక్కు లేదన్నారు.












Click it and Unblock the Notifications