కేబినెట్ భేటీలో మంత్రి కన్నీటి పర్యంతం, ఓదార్చిన సీఎం చంద్రబాబు..!!
ఏపీ మంత్రివర్గ సమావేశంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. మంత్రి కన్నీళ్లు పెట్టుకోవటం.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఓదార్పు కీలకంగా మారింది. కేబినెట్ భేటీలో పలు కీలక అంశాల పైన చర్చ జరిగింది. కొత్త జిల్లాల ఏర్పాటు పైన చర్చకు వచ్చిన సమయంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ప్రజాభిప్రాయం మేరకు కొత్త జిల్లాలకు తుది రూపం ఇచ్చే అంశం పైన మంత్రివర్గ భేటీలో చర్చించారు. కాగా, మరి కొన్ని ప్రధాన నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
ఏపీ మంత్రివర్గ సమావేశంలో జిల్లాల పునర్విభజనకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. జిల్లాల పునర్విభజన పైన ప్రభుత్వం జారీ చేసిన గజెట్ పైన ప్రజల నుంచి పలు వినతులు వచ్చాయి. ప్రజాభిప్రాయాలకు అనుగుణంగా జిల్లాలు.. మండలాల్లో మార్పులు ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంత్రివర్గ భేటీలో జరిగిన చర్చలో తొలుత ప్రతిపాదించిన
కొత్త జిల్లాలు.. మండలాలలో మార్పులు చేయాలనే చర్చ జరిగింది. ఈ సమయంలో మంత్రి రాం ప్రసాద్ రెడ్డి ఒకింత ఎమోషనల్ అయ్యారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న అన్నమయ్య జిల్లా.. తన సొంత నియోజకవర్గం రాయచోటి గురించి మంత్రి తన అభిప్రాయం వ్యక్తం చేసారు. కాగా.. సీఎం చంద్రబాబు జోక్యం చేసుకొని తాను రాయచోటి అభివృద్ధి చూస్తానని హామీ ఇచ్చారు.

మంత్రి రాం ప్రసాద్ రెడ్డిని ఓదార్చారు. కొత్త జిల్లాలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేయటంతో ఈ నెల 30న తుది నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక.. ఈ కేబినెట్ భేటీలో ఋషి కొండ భవనాల పైన చర్చకు వచ్చినట్లు సమాచారం. అదే విధంగా ఏలూరు జిల్లా నూజివీడు టౌన్‌లో ఇండియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మెనేజ్మెంట్ కోసం 9.96 ఎకరాలు భూమిని డైరెక్టర్, హర్టీకల్చర్, సెరికల్చర్ డిపార్మెంట్‌కు 33 ఏళ్లకు లీజు ప్రాతిపదికన బదిలీ చేస్తూ తీసుకున్న నిర్ణయానికి మంత్రిమండలిలో ఆమోదం తెలిపినట్లు సమాచారం.
వేదాంతా లిమిటెడ్‌కు 9.88 ఎకరాలు భూమిని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమజిల్లాలో ఆఫ్ షోర్ డ్రిల్లింగ్ యాక్టివీటీ కోసం మూడేళ్ల పాటు లీజుకు కేటాయిస్తూ ఈరోజు కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 37 ఎకరాలు ప్రభుత్వ భూమిని తిరుపతి రూరల్ మండలం దామినేడు గ్రామంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌కు స్పోర్ట్స్ సిటీ నిర్మాణం కోసం ఉచితంగా అందిస్తూ ఉత్తర్వులు ఇవ్వనున్నారు.
క్యాబినెట్ నుంచి బయటికి వచ్చాక మీడియా ముందు కన్నీరు పెట్టుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి..!!#RamPrasadReddy #ApCabinet #AndhraPradesh #OIUpdates #Oneindiatelugu pic.twitter.com/b9BlCqeWzJ
— oneindiatelugu (@oneindiatelugu) December 29, 2025
-
పనిలో పని.. పాకిస్థాన్ నూ లేపేస్తే పోలా..!! -
నా ఆస్తులు చూసి నేనే షాకయ్యా: తనికెళ్ల భరణి సెటైర్లు! -
నన్ను బలిపశువును చేస్తున్నారు! -
T20 World Cup Final: సౌతాఫ్రికాతో పైనల్ వీళ్లకే- పాక్ మాజీ కెప్టెన్ జోస్యం..! -
జాక్‌పాట్ కొట్టిన సంజు శాంసన్..!! -
ఇరగదీశావ్ పో..: రామ్ చరణ్ డాన్స్ మూమెంట్స్ మెగాస్టార్ ఫిదా -
మహిళలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కొత్త పథకం అమల్లోకి..! -
పాతాళానికి దిగజారుతున్న బంగారం ధరలు -
ఓటీటీలోకి కిర్రాక్ కామెడీ మూవీ.. పొట్టు పొట్టు నవ్వుకోండి..! -
బాలయ్య - గోపీచంద్ మలినేని మూవీలో విలన్‌గా మంచు హీరో..! -
విజయ్ రూ. 250 కోట్ల భరణం? -
ఆ హీరోయిన్ ను పెళ్లాడనున్న ఆనంద్ దేవరకొండ..?












Click it and Unblock the Notifications