జగన్ లాంటి సీఎం దేశంలో లేడు, ఆయన చేసిన పనులు ఎన్నో!!

వైసీపీ నాయకులు దుర్మార్గపు పనులు చేసి మామీద దుష్ప్రచారం చేస్తున్నారని, వైసీపీ అధినేత జగన్ చేసిన అరాచకాలు లెక్కపెట్టలేమని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. ముంబాయి హీరోయిన్‌ను విజయవాడ తీసుకువచ్చి పోలీసులతో వేధించిన ఘనత వైసీపీ నాయకులదే అని, ముంబాయిన నటి కేసు గురించి దేశం మొత్తం తెలిసిపోయిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు..

మంగళవారం ప్రకాశం జిల్లాలో మీడియాతో మాట్లాడిన మంత్రి రవి కుమార్ వైసీపీ నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో శాంతి భద్రతలు పట్టించుకున్న దాఖలాలు లేవని, దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని దుర్మార్గపు పనులు గత ఐదేళ్లలో వైఎస్ జగన్ చేశారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ నాయకులు ఎలాంటి నులు చేశారో అనే విషయం ప్రజలు గుర్తు పెట్టుకుంటారని మంత్రి రవికుమార్ అన్నారు.

Minister Ravikumar alleged that CM Jagan is the only person who has done more anarchy in the country

అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీని కేవలం 11 సీట్లకు పరిమితం చేశారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వ్యంగంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత శాంతి భద్రతలు పటిష్టం చేస్తున్నామని, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ఈ విషయంలో చంద్రబాబు నాయుడు కూడా రాజీ కారని, ఈ విషయం తెలుసుకుని జాగ్రత్తగా ఉంటే అందరికి మంచిదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వైసీపీ కార్యకర్తలను హెచ్చరించారు.

గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఒక్కరూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని మంత్రి రవికుమార్ గుర్తుచేశారు. గత ప్రభుత్వంలో జగన్ చేసిన అరాచకాల వలన రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు సర్వనాశనం అయ్యాయని, జగన్ ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు. నారా చంద్రబాబు నాయుడు సీఎం అయిన తరువాత రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు సర్వశక్తుల పని చేస్తున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు.

జగన్ చేసిన అరాచకాల వలన ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరోపిచారు. వైసీపీ నాయకులు చేసిన అరాచకాలు ప్రజలు మరిచిపోలేదని, రాష్ట్రాన్ని ఎంత సర్వనాశనం చెయ్యాలో అంతా చేసేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార ఆరోపించారు. దేశంలో ఏ సీఎం చెయ్యని అరాచకాలు అన్ని జగన్ చేసి ఈరోజు ఇంటికి వెళ్లిపోయాడని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+