హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కృష్ణ ఒక లెజెండ్ - మహేష్ తో ఆ పాత్రలో చేయాలని ఉంది: రోజా ఎమోషనల్..!!

|
Google Oneindia TeluguNews

ఏపీ మంత్రి రోజా సూపర్ స్టార్ కృష్ణ భౌతిక ఖాయానికి నివాళి అర్పించారు. పద్మాలయ స్టూడియోలో కృష్ణ కుటుంబ సభ్యులను రోజా ఓదార్చారు. అప్పుడే అక్కడకు చేరుకున్న తెలంగాణ గవర్నర్ తమిళసైకు కృష్ణ కుటుంబ సభ్యులను రోజా పరిచయం చేసారు. కృష్ణ తో తాను కలిసి నటించిన పాత్రలను రోజా గుర్తు చేసుకున్నారు. కృష్ణ గురించి వివరిస్తూ మంత్రి రోజా ఎమోషనల్ అయ్యారు. కృష్ణ రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ లెజెండ్ అని రోజా పేర్కొన్నారు.

సంచలనానికి కేరాఫ్ అడ్రస్ గా

సంచలనానికి కేరాఫ్ అడ్రస్ గా


సాహసానికి -సంచలనానికి కేరాఫ్ అడ్రస్ గా కృష్ణ నిలుస్తారన్నారు. ప్రతీ జీవితంలో గెలుపు - ఓటములు సహజమని చెప్పిన రోజా.. కృష్ణ తన జీవితంలో రెండింటిన సమానంగా తీసుకున్నారని వివరించారు. ఇప్పుడు కొందరు రెండు సినిమాలు హిట్ కాగానే పొంగిపోవటం, రెండు ఫెయిల్ కాగానే డిఫ్రెషన్ లోకి వెళ్లటం చూస్తున్నమన్నారు. కృష్ణ మరణించిన బాధా కరమైనా..జీవితంలో ఆయన అన్నింటినీ చూసేసారని వివరించారు. తెలుగు సినీ పరిశ్రమలో టెక్నాలజీ అంటే కృష్ణ ముందు నిలిచేవారని గుర్తు చేసారు.

ఎప్పటికీ తెలుగు ప్రజల మనస్సుల్లో

ఎప్పటికీ తెలుగు ప్రజల మనస్సుల్లో


అల్లూరి సీతారామ రాజుగా కృష్ణ ఎప్పటికీ తెలుగు ప్రజల మనస్సుల్లో నిలిచిపోతారని రోజా చెప్పుకొచ్చారు. మహేష్ బాబు తనకు చిన్నప్పటి నుంచి తెలుసని చెప్పారు. తల్లి..అన్న..ఇప్పుడు తండ్రిని పోగొట్టుకున్న మహేష్, ఈ ఆవేదన ఎలా తట్టుకుంటున్నారో ఆలోచన చేస్తేనే బాధ కలుగుతోందన్నారు. తనకు మహేష్ అంటే చాలా ఇష్టమని చెప్పిన మంత్రి రోజా.. తనకు మహేష్ కు అక్క పాత్రలో చేయాలని చాలా కాలంగా కోరికగా ఉండేదని వివరించారు.

ఎప్పటికీ మర్చిపోలేనంటూ

ఎప్పటికీ మర్చిపోలేనంటూ


డౌట్ టు ఎర్త్ అన్నీ చూసిన కృష్ణ షూటింగ్ సమయాల్లో తమ పైన చూపిన ప్రేమ తాను ఎప్పటికీ మర్చిపోలేనంటూ రోజా చెప్పుకొచ్చారు. కృష్ణ కుటుంబంతో వైఎస్సార్ కు ఉన్న బంధం మాటల్లో చెప్పలేనిదన్నారు. ఆ రెండు కుటుంబాల మధ్య మంచి అనుబంధం - ఆప్యాయత ఉందని వివరించారు. కష్టంలో ఉన్న కృష్ణ కుటుంబానికి సినిమా పరిశ్రమ అండగా నిలిచిందన్నారు. అదే విధంగా సీఎం జగన్..వైసీపీ పూర్తిగా కృష్ణ కుటుంబానికి మద్దతుగా నిలుస్తుందని మంత్రి రోజా చెప్పారు.

English summary
Minister Roja pays tributes to uperstar Krishna, says he was a legend in Telugu cine Industry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X