భావోద్వేగానికి గురైన ఫైర్ బ్రాండ్ రోజా: నాపై ఐరన్ లెగ్ ముద్ర వేశారు

తనపై ఐరన్ లెగ్ అనే ముద్ర వేశారని ఏపీ మంత్రి రోజా పోస్ట్ పెట్టారు.

రాష్ట్ర క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి ఆర్.కె.రోజా భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం ఆమె చేసిన పోస్టు వైరలవుతోంది. తనపై ఐరన్ లెగ్ ముద్ర అన్నది ఎందుకు వచ్చిందో స్పష్టత ఇచ్చారు.

ఫైర్ బ్రాండ్ గా రోజా

ఫైర్ బ్రాండ్ గా రోజా


ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందారు రోజా. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు, ప్రస్తుతం వైసీపీలో మంత్రి ఉన్నప్పుడు కూడా పదునైన విమర్శలతో, ప్రత్యర్థులపై వాగ్బాణాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వైసీపీలో చేరిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును, ఆయన తనయుడు లోకేష్ ను విమర్శించడంలో ముందుండే రోజా జనసేనాని పవన్ కల్యాణ్ ను కూడా అాదేస్థాయిలో టార్గెట్ చేశారు. ఈ ముగ్గురు నేతలతో జబర్దస్త్ పంచ్ లతో మాటల తూటాలు పేలుస్తూనే ఉన్నారు.

మంత్రి భావోద్వేగం

మంత్రి భావోద్వేగం


తాజాగా మంత్రి రోజా భావోద్వేగానికి గురయ్యారు. మంత్రి అవడానికి ముందు వరకు ఆమెను ఐరన్ లెగ్ అంటూ ప్రత్యర్థులు విమర్శలు చేసేవారు. అయితే గతంలో ఎప్పుడూ స్పందించని ఆమె తాజాగా చేసిన పోస్టు సంచలనంగా మారింది. తనపై ఐరన్ లెగ్ అనే ముద్ర వేశారని ఏపీ మంత్రి రోజా పోస్ట్ పెట్టారు. జీవితంలో మన ఎదుగుదలని కించపరిచేవారుంటారు.. అభినందించేవారుంటారు.. మన ఎదుగుదల మన చేతిలోనే ఉంటుందంటూ రోజా ఆ పోస్టులో భావోద్వేగానికి గురయ్యారు. దీంతో అన్నిచోటలా ఇది చర్చనీయాంశంగా మారింది. రాస్ సంస్థ ఆధ్వర్యంలో పుత్తూరులో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

 ఆసక్తికర పోస్టు పోస్ట్ చేసిన మంత్రి రోజా

ఆసక్తికర పోస్టు పోస్ట్ చేసిన మంత్రి రోజా


రాస్ ఆధ్వర్యంలో గర్భిణీలకు శ్రీమంతం వృద్ధులకు దుప్పట్లు, చేతికర్రలు పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ ఆసక్తికర పోస్టు చేశారు. ఇప్పుడెందుకు ఆమె ఈ పోస్టు చేశారన్నది చర్చగా మారింది. మధ్యతరగతి కుటుంబంలో పుట్టానని, కథానాయికగా నటించానని గుర్తుచేశారు. మంత్రిగా మీ ముందుకు రావడం వెనక ఎన్నో కష్టాలు, అవమానాలు పడ్డానని తన మనసులో బాధను బహిరంగపరిచారు. ఎన్నో కష్టాలు, అవమానాలు పడ్డానని తెలిపారు. చాలా అవమానాలు పడిన తర్వాత ఇంకా ఆమె ఏమన్నారంటే..? తాను మధ్యతరగతి కుటుంబంలో పుట్టానని గుర్తు చేశారు. హీరోయిన్ గా, నాయకురాలిగా, మంత్రిగా మీ ముందుకి రావడం వెనుక ఎన్నో కష్టాలు ఎన్నో అవమానాలు పడ్డాను అని తన మనసులో బాధను అంతా బహిరంగపరిచారు.

అవమానాలు పడ్డతర్వాతే ఈ స్థాయి దక్కింది

అవమానాలు పడ్డతర్వాతే ఈ స్థాయి దక్కింది


చాలా అవమానాలు పడిన తరువాతే ఈ స్థాయి దక్కింది అన్నారు సినిమా కథానాయికగా ఎన్ని అవకాశాలు వచ్చినా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా 150 సినిమాల్లో నటించానని చెప్పారు. ఇలా తన కెరీర్ ఉన్నతంగా సాగడానికి సినిమాలు తీసిన నిర్మాత, దర్శకులు, అవకాశం ఇచ్చి ప్రోత్సహించిన అందరికీ ధన్యవాదాలున్నారు. రాజకీయాల్లో వార్డు సభ్యురాలిగా కూడా గెలవలేనని, ఐరన్ లెగ్ ముద్ర వేయడానికి చాలా ప్రయత్నాలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. విమర్శలకు భయపడకుండా పట్టుదలతో రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించానని, ఇప్పుడు మంత్రిగా మీ ముందు ఉన్నానంటూ దీనికి కారణం ప్రజలను నమ్ముకోవడమేనన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+