బ్రాహ్మణిని అందుకే రంగంలో, పవన్ నీ బతుకెంత - రోజా కీలక వ్యాఖ్యలు..!!

ముఖ్యమంత్రి జగన్ పైన పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రులు సీరియస్ అయ్యారు. ముఖ్యమంత్రిని ఉద్దేశించి నీవెంత..నీ బతుకెంత అంటూ చేసిన వ్యాఖ్యలపైన మండిపడ్డారు. అసలు పవన్ బతకు ఎంత అంటూ మంత్రులు నిలదీస్తున్నారు. తాజాగా చంద్రబాబు అరెస్ట్ తరువాత పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తు ప్రకటించారు. ఈ సమయంలో బ్రాహ్మణి పైనా మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేసారు. దీంతో డైలాగ్ వార్ పీక్ కు చేరింది.

పవన్ పై మంత్రుల ఫైర్ : జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు సీరియస్ అయ్యారు. మంత్రి రోజా వరుస ప్రశ్నలతో పవన్ పై మండిపడ్డారు. చంద్రబాబు అరెస్ట్ పై నారా బ్రాహ్మణి చేసిన కామెంట్స్ పైనా రోజా స్పందించారు. చంద్రబాబు చేసిన అవినీతి ఏంటో సీఐడీ కార్యాలయానికి వెళ్తే అన్ని ఆధారాలు చూపిస్తారని చెప్పుకొచ్చారు.

Minister Roja Made Serious comment Againt Pawan Kalyan and Nara Barahmani

టీడీపీ బ్రాహ్మణిని బ్రహ్మస్త్రంగా భావించారని..కానీ, ఆ అస్త్రం తుస్సుమందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఎక్కడ సంతకాలు చేసారని పవన్ ప్రశ్నిస్తున్నారని..చంద్రబాబు ఎన్నిక సంతకాలు చేసారో కోర్టులో సీఐడీ అధికారులు స్పష్టంగా నిరూపించారని చెప్పుకొచ్చారు. దేవాన్ష్ సైతం తన తాత ఇంత అవినీతి పరుడా అని అనుకుంటాడంటూ రోజా పేర్కొన్నారు.

సోనియానే ఎదిరించారు : సీఎం జగన్ ను పట్టుకుని నీ బతుకెంత అని పవన్ అడుగుతాడా అంటూ రోజా ఫైర్ అయ్యారు. 2 సార్లు ఎంపీ, 2 సార్లు ఎమ్మెల్యే, 151 మంది మద్దతుతో జగన్ సీఎం అయ్యారని గుర్తు చేసారు. 22 మంది ఎంపీలను తన జెండా, అజెండాతో గెలిపించారని రోజా చెప్పుకొచ్చారు. నీ సొంత అన్ననే గెలిపించుకోలేకపోయిన పవన్ ను ప్రజలు నీవెంత నీబతుకెంత అని అడుగుతున్నారని రోజా పేర్కొన్నారు.

ప్రజలకు ఇఛ్చిన మాట కోసం దేశాన్నే గడగడలాడించిన సోనియా నే ఎదుర్కొన్న నేత జగన్ అని రోజా వివరించారు. తల్లిని తిట్టిన వాడితో ప్యాకేజీ మాట్లాడుకున్న వ్యక్తి పవన్ అని రోజా వ్యాఖ్యానించారు. రాష్ట్ర చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో 82 శాతం సీట్లతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి జగన్ అని రోజా చెప్పుకొచ్చారు.

Minister Roja Made Serious comment Againt Pawan Kalyan and Nara Barahmani

డిపాజిట్లు దక్కని పవన్ : జనసేన 136 స్థానాల్లో నిలబడితే 120 చోట్ల డిపాజిట్లు గల్లంతు అయ్యాయని గుర్తు చేసారు. జగన్ పార్టీ పెట్టి ఎంపీగా పోటీ చస్తే 5.43 లక్షల ఓట్ల మెజార్టీతో రికార్డు సాధించారని గుర్తు చేసారు. జగన్ ఫొటోతో పోటీ చేసిన గ్రంధి శ్రీనివాస్, తిప్పల నాగిరెడ్డి చేతిలో ఓడిన పవన్ గురించి అందరూ ప్రశ్నిస్తున్నారని రోజా పేర్కొన్నారు. 12 ఏళ్లు పార్టీగా నడిపిస్తున్న దమ్మున్న నేత జగన్ గా రోజా వివరించారు.

పవన్ తన జెండా తప్ప అందరి జెండాలు మోసే కూలీగా మిగిలాడని రోజా వ్యాఖ్యానించారు. సీఎం జగన్ కోసం నోటికొచ్చినట్టు మాట్లాడితే పవన్ అయిన, ఎవడికైనా పళ్లు రాలగొడతామని రోజా హెచ్చరించారు. సీమన్స్ మాజీ ఎండి సుమన్ బోస్ ఓ పెద్ద దొంగగా మంత్రి రోజా పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+