వైసీపీ ఎంపీ న్యూడ్ వీడియో - మంత్రి రోజా రియాక్షన్..!!
రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో చర్చకు కారణమైన వైసీపీ ఎంపీ న్యూడ్ వీడియో పైన ఏపీ మంత్రి రోజా స్పందించారు. నాలుగు రోజుల క్రితం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు సంబందించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఎంపీ న్యూడ్ వీడియో పైన రాజకీయంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఎంపీ అనైతిక వ్యవహారాల పైన మండిపడ్డాయి. దీని పైన మాధవ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు. ఇది మార్ఫింగ్ వీడియోగా చెప్పుకొచ్చారు. టీడీపీ నేతల కుట్రగా ఆరోపించారు.

సీఎం ముందుకు రాని మాధవ్
ఫోరెన్సిక్ కు పంపాలని కోరుతూ టీడీపీకి చెందిన కొందరి పైన ఫిర్యాదు చేసారు. అటు తమ పైన ఆరోపణలు చేయటంతో మాధవ్ పైన టీడీపీ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడు పరువు నష్టం దావా వేసారు. ఇక, ఇదే అంశం పైన సీఎం జగన్ ఆరా తీసారు. పూర్తి నివేదిక ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం నుంచి సజ్జల ఎంపీ మాధవ్ ను వివరణ కోరారు. అదంతా తన పైన చేస్తున్న దుష్ప్రచారంగా ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో..ఆ ఫిర్యాదు పైన నివేదిక రాగానే నిర్ణయం తీసుకోవాలనే అభిప్రాయంతో వైసీపీ అధినాయకత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆయన పైన సస్పెన్షన్ వేటు పడే అవకాశం ఉందనే ప్రచారం సాగింది.

మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు
ఇక, ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్ ను ఎంపీ మాధవ్ కలవలేదు. మిగిలిన ఎంపీలు స్వాగతం పలికినా..మాధవ్ సీఎం ముందుకు వెళ్లలేదు. తాజాగా, ఏపీ మహిళా కమిషన్ ఈ వ్యవహారం విచారణ చేయాలని డీజీపీకి సూచించింది.ఈ మొత్తం వ్యవహారం పైన మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేసారు. ఎంపీ వీడియో నిజమో కాదో తెలియకుండా టీడీపీ విమర్శలు చేయటం సరి కాదని వ్యాఖ్యానించారు. నిజం తేలిన తరువాత సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని చెప్పుకొచ్చారు. ఏ మహిళకు అన్యాయం జరిగినా సీఎం సహించరని పేర్కొన్నారు.

సీఎం జగన్ నిర్ణయం పై ఉత్కంఠ
టీడీపీ హయాంలో ఎన్నో అఘాయిత్యాలు జరిగాయని వివరించారు. నారాయణ విద్యా సంస్థల్లొ విద్యార్ధినులను వేధించినా ఒక్క కేసు అయినా పెట్టారా అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు మాధవ్ వ్యవహారంలో ముఖ్యమంత్రి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ పార్టీలో కనిపిస్తోంది. నిజమని తేలితే కఠిన చర్యలు ఉంటాయని ఇప్పటికే సజ్జల స్పష్టం చేసారు. తొలి నుంచి మాధవ్ వ్యవహారం వివాదాస్పదంగానే ఉంది. పార్టీలో పెద్ద ఎత్తున ఎంపీ శైలి పైన చర్చ జరిగింది. దీంతో..ఇప్పుడు సీఎం నిర్ణయం పైన ఉత్కంఠ నెలకొని ఉంది.












Click it and Unblock the Notifications