సిగ్గులేకుండా చంద్రబాబు బాదుడేబాదుడు; ఆయన పాలనలో రైతుల కష్టానికి విలువలేదు: మంత్రి రోజా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. జగన్మోహన్ రెడ్డి బాదుడే బాదుడు అంటూ తెలుగుదేశం పార్టీ ప్రజాక్షేత్రంలోకి వెళ్లి జగన్ పాలనలో రాష్ట్ర పరిస్థితిని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తుంటే, వైసిపి గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలపై వివరించేందుకు ప్రజల్లోకి వెళుతుంది. ఇక ఇదే సమయంలో ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటూ టిడిపి, వైసిపి నేతలు రాజకీయాలను రసవత్తరంగా మారుస్తున్నారు.

రైతుల గురించి చంద్రబాబు ఏ రోజైనా ఆలోచించారా? రోజా ప్రశ్న
తాజాగా
మంత్రి
రోజా
తిరుపతిలో
జరిగిన
రైతు
భరోసా
చెక్కుల
పంపిణీ
కార్యక్రమంలో
పాల్గొన్నారు.
ఈ
కార్యక్రమంలో
మంత్రి
రోజా
ఆసక్తికరమైన
వ్యాఖ్యలు
చేశారు.
రైతుల
గురించి
సీఎం
జగన్
మోహన్
రెడ్డి
అనునిత్యం
ఆలోచిస్తున్నారని
రోజా
పేర్కొన్నారు.
14
ఏళ్లు
అధికారంలో
ఉండి
13
ఏళ్ళు
ప్రతిపక్షంలో
ఉన్న
చంద్రబాబు
రైతుల
గురించి
ఏరోజైనా
ఆలోచించారా
అని
రోజా
విమర్శలు
గుప్పించారు
రాష్ట్రంలో
రైతాంగానికి
సహాయం
చేసే
రైతు
భరోసా
అలాంటి
గొప్ప
పథకం
గురించి
ఏనాడైనా
చంద్రబాబు
ఆలోచించారా
అంటూ
రోజా
ప్రశ్నించారు.

సిగ్గు లేకుండా బాదుడే బాదుడు అంటున్న చంద్రబాబు తీరు
రాష్ట్రంలో ఎక్కడ బడితే అక్కడ సిగ్గులేకుండా చంద్రబాబు బాదుడే బాదుడు అంటున్నారని రోజా మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 92 శాతం రైతులను అప్పుల ఊబిలో ముంచారని రోజా విమర్శలు గుప్పించారు. వ్యవసాయం దండగ అని పుస్తకం రాసింది చంద్రబాబు కాదా అంటూ చంద్రబాబు పాలనలో రైతుల కష్టానికి విలువ లేదంటూ రోజా మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో రైతుల చెమటకు ఖరీదు లేదని, ఆరుగాలం కష్టపడి పంట పండించిన గిట్టుబాటు ధర లేదని రోజా విమర్శలు గుప్పించారు.

ఇండియన్ హిస్టరీలోనే రైతుల కోసం కమిట్మెంట్ ఉన్న నాయకుడు జగన్
భారత దేశ హిస్టరీ లో ఫస్ట్ టైం కమిట్మెంట్ తో రైతులను ఆదుకోవడానికి ముందుకు వచ్చిన నాయకుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి అంటూ రోజా జగన్ కు కితాబిచ్చారు. ఎంతోమంది వేదికలపైన మాటలు చెప్పడానికి పరిమితమయ్యారని, కానీ రైతు సంక్షేమాన్ని చేతల్లో చూపించిన నాయకుడు జగన్ అంటూ రోజా పేర్కొన్నారు. రోజా పాల్గొన్న రైతు భరోసా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎంపీలు, రెడ్డప్ప, గురుమూర్తి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి, వెంకట్ గౌడ్, మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.

ఏపీలో వైఎస్సార్ రైతు భరోసా ప్రారంభించిన జగన్
ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఏలూరు జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమాన్ని బటన్ నొక్కి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన చంద్రబాబుపై, పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇదిలా ఉంటే తిరుపతిలో నిర్వహించిన రైతు భరోసా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో నగిరి ఎమ్మెల్యే, మంత్రి రోజా చంద్రబాబును టార్గెట్ చేశారు.