• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగనన్న కాదు దున్న.. లోకేష్ షాకింగ్ వ్యాఖ్యలు; సీఎం పై ఇలానా ..మండిపడిన మంత్రి శంకర్ నారాయణ

|
Google Oneindia TeluguNews

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి మూర్ఖపు ముఖ్యమంత్రి అని, మంత్రులు కంత్రీలు అంటూ మండిపడిన లోకేష్ జగన్ అన్న కాదు జగన్ దున్న అని ఫైర్ అయ్యారు. దున్న ఏం చేస్తుంది.. వెంటపడి తరుముతుంది.. కుమ్మేస్తుంది.. అడ్డుగా ఉన్న వాటిని నాశనం చేస్తుంది అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జగన్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై వైసిపి మంత్రి శంకర్ నారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

సీఎం జగన్ ను అలా పిలవటం సమంజసమేనా ?

సీఎం జగన్ ను అలా పిలవటం సమంజసమేనా ?

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి దున్న అని పేరు పెట్టడం సమంజసమేనా అంటూ మంత్రి శంకర్ నారాయణ నారా లోకేష్ పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. విద్యార్థి లోకాన్ని తన స్వార్ధ ప్రయోజనాల కోసం వాడుకున్నందుకు తెలుగుదేశం పార్టీకి సిగ్గు అనిపించడం లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దెబ్బతిన్న విద్యార్థులు తమపై పోలీసులు ఎలాంటి లాఠీఛార్జి చేయలేదని చెబుతుంటే, కేవలం టిడిపి నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం, తమ స్వార్థం కోసం విద్యార్థులను వాడుకుంటున్నారని విమర్శలు గుప్పించారు మంత్రి శంకర్ నారాయణ.

 ఎయిడెడ్ కళాశాలలు, స్కూల్స్ విలీనం రగడ .. విద్యార్థులపై లాఠీ చార్జ్

ఎయిడెడ్ కళాశాలలు, స్కూల్స్ విలీనం రగడ .. విద్యార్థులపై లాఠీ చార్జ్

అసలు విద్యార్థులపై లాఠీచార్జీ చేసింది పోలీసులే కాదంటూ తేల్చి చెబుతున్నారు. కావాలని తెలుగుదేశం పార్టీ నేతలు దీనిని రగడ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఎయిడెడ్ కళాశాలలు, పాఠశాలల విలీన వ్యవహారం వివాదాస్పదం కాగా దీనిని వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలు అనంతపురంలో చేపట్టిన నిరసన ప్రదర్శనలు, ఆందోళన కార్యక్రమాలు ఉద్రిక్తతలకు దారి తీసిన విషయం తెలిసిందే. ఆందోళన ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీంతో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.

Recommended Video

  NTR ని TDP నుండి సస్పెండ్ చేసి.. ఇప్పుడు నాటకాలా.. Vijaysaireddy మాస్ ట్రోలింగ్ || Oneindia Telugu
   విద్యార్థులపై లాఠీ చార్జ్ చెయ్యటంపై లోకేష్ ఫైర్ . సీఎం జగన్ , మంత్రులపై తీవ్ర వ్యాఖ్యలు

  విద్యార్థులపై లాఠీ చార్జ్ చెయ్యటంపై లోకేష్ ఫైర్ . సీఎం జగన్ , మంత్రులపై తీవ్ర వ్యాఖ్యలు

  ఈ క్రమంలో విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేష్ గాయపడిన విద్యార్థులను పరామర్శించడానికి అనంతపురం వెళ్లిన నేపథ్యంలో మరోమారు సీఎం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఇక విద్యార్థుల పై లాఠీచార్జి గురించి వివరణ ఇచ్చిన మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యలను సైతం ప్రస్తావించి మంత్రులను టార్గెట్ చేశారు. విద్యార్థులకు క్షమాపణ చెప్పాల్సిన వైసీపీ మంత్రులు ఏం మాట్లాడుతున్నారో విన్నారా అంటూ పేర్కొన్న లోకేష్ విద్యార్థి సంఘాల ముసుగులో దుండగులు పోలీస్ డ్రెస్ వేసుకొని విద్యార్థులపై దాడి చేశారట అంటూ వైసీపీ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

  లోకేష్ వ్యాఖ్యల రగడ .. ఏపీలో ఏం జరగనుందో

  లోకేష్ వ్యాఖ్యల రగడ .. ఏపీలో ఏం జరగనుందో


  ఇంకో మంత్రి అసలు అక్కడ పోలీసులే లేరని విద్యార్థులే కొట్టుకొని తల పగలగొట్టుకున్నారని అంటున్నారని మంత్రి వ్యాఖ్యలపై లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇలా వదిలేస్తే అసలు అనంతపురం జిల్లాలో ఎస్ఎస్బిఎన్ కళాశాల లేదని అంటారేమో అంటూ ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డి బ్లడ్ లోనే డెవలప్మెంట్ లేదని, మొత్తం వినాశనమే ఉందని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, జగనన్న కాదు జగన్ దున్న అంటూ వ్యాఖ్యానించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే వైసీపీ నేతలు లోకేష్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్న నేపథ్యంలో తాజా వ్యాఖ్యలపై మరెంత రగడ కొనసాగనుందో అన్న చర్చ ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.

  English summary
  Minister Shankar Narayana slams Lokesh shocking remarks on CM Jagan. Minister Shankar Narayana was angry over Lokesh's remarks, asking that is it right to call a CM with abusive words..
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X