ఏపీలో స్థలం కేటాయించాం: హైకోర్టు విభజనపై సుజనా కొలికి

అమరావతి: ఏపీ విభజన చట్టంలోని సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందని కేంద్రమంత్రి సుజనా చౌదరి అన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రెండు రాష్ట్రలకు నష్టం కలగకుండా విభజన సమస్యల్ని పరిష్కరించుకోవాలన్నారు.

గతకొన్ని రోజులుగా తెలంగాణలోని లాయర్లు చేస్తున్న ఆందోళనలు, ధర్నాపై స్పందించిన ఆయన 'హైకోర్టు విభ‌జ‌న‌పై మాకు ఎటువంటి అభ్యంత‌రం లేదు' అని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని కేంద్ర బృందం పరిశీలించిందని కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పారు.

babu-jaitly meeting

హైకోర్టు విభజన కన్నా ముందు ఎపి భవన్ సహా మిగతా సంస్థల విభజన జరగాలని ఆయన అన్నారు. విభజన చట్టంలో కేవలం హైకోర్టుకు భూమి ఇవ్వాలనే ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మౌలిక సదుపాయాలు కల్పించాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని ఆయన అన్నారు. హైకోర్టు అంశంపై అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారని వ్యాఖ్యానిచారు.

ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు ఏర్పాటుపై అక్కడి ప్రభుత్వం బాధ్యతగానే ఉందని ఆయన తెలిపారు. హైకోర్టు కోసం అమరావతిలో ఇప్పటికే స్ధలం కేటాయించామని చెప్పిన ఆయన ఏపీకి రావాల్సిన నిధులు, ప్రత్యేకహోదాపై కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో చర్చించామని అన్నారు.

babu-jaitly meeting

హైకోర్టుని విభజించాలంటూ శుక్రవారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద తెలంగాణ లాయర్లు మహాధర్నా నిర్వహించారు. ఈ మహాధర్నాలో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా అడ్వకేట్లు హైదరాబాద్‌కు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

హైకోర్టు విభజన కోరుతూ తెలంగాణ లాయర్లు చేస్తున్న ఆందోళనలపై ఇరు రాష్ట్రాలకు చెందిన నేతలు మీడియా సమావేశాల్లో మాట్లాడుతూనే ఉన్నారు. లాయర్ల ఆందోళనల వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని తెలంగాణ బీజేపీ నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఇక ఏపీకి చెందిన టీడీపీ నేతలు సైతం లాయర్ల ఆందోళనపై మండిపడుతున్నారు.

babu-jaitly meeting

తెలంగాణ న్యాయాధికారులు, న్యాయశాఖ ఉద్యోగులు, న్యాయవాదులు చేపడుతున్న ఆందోళనలపై శుక్రవారం చీఫ్ జస్టిస్ స్పందించారు. లాయర్లు తమ ఆందోళనను విరమించి వెంటనే విధుల్లో చేరాలని చీఫ్ జస్టిస్ దిలిప్ బాబాసాహెజ్ భోసలే విజ్ఞప్తి చేశారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వ్యవహారించాలని ఆయన సూచించారు. ఆందోళన విరమించకుంటే ప్రత్యామ్నాయాలు చూడాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+