వాలంటీర్ ను చంపించి ఇప్పుడు కథలు చెబుతారా ?, మంత్రి

కోనసీమ జిల్లా వాలంటీర్ దుర్గాప్రసాద్ హత్య కేసులో వైసీపీ మాజీమంత్రి విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ ను పోలీసులు అరెస్టు చేసిన విషయంలో తన పాత్ర ఏమీ లేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు కూడా కక్ష సాధింపు చర్యలు పాల్పడకూడదని సీఎం చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారని, వారి ఆదేశాలకు అనుగుణంగానే మేము పని చేస్తున్నామని మంత్రి సుభాష్ అన్నారు.

వైసీపీ నాయకుడు, మాజీమంత్రి విశ్వరూప్ పైన ఆంధ్రప్రదేశ్ మంత్రి సుభాష్ విరుచుకుపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడిన మంత్రి వాసంశెట్టి సుభాష్ వైసీపీ నాయకుడు, మాజీమంత్రి విశ్వరూప్ పై మండిపడ్డారు. మాజీమంత్రి విశ్వరూప్ చేసిన ఆరోపణలలో ఇలాంటి వాస్తవం లేదని మంత్రి సుభాష్ అన్నారు. కొడుకు శ్రీకాంత్ ను రక్షించుకోవడానికి విశ్వరూప్ తన మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మంత్రి సుభాష్ మండిపడ్డారు.

Minister Vasamshetty Subhash is furious over YCP leader Vishwaroop s allegations

దళిత యువకుడు, వాలంటీర్ జనపల్లి దుర్గాప్రసాద్ హత్య కేసులో ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు వైసీపీ నాయకుడు విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ ను తమిళనాడులో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మంత్రి సుభాష్ ఒత్తిడి కారణంగానే పోలీసులు తన కొడుకు శ్రీకాంత్ ను అరెస్టు చేశారని సోమవారం మాజీ మంత్రి విశ్వరూప్ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు మా పైన కక్ష సాధింపులు చర్యలకు పాల్పడుతున్నారని వైసీపీ నాయకుడు విశ్వరూప్ ఆరోపించారు.

ఈ విషయంపై మంత్రి సుభాష్ మండిపడ్డారు. మాజీ మంత్రి విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్, వాలంటీర్ దుర్గాప్రసాద్ చాలా సన్నిహితులని మంత్రి సుభాష్ చెప్పారు. స్నేహితుడు శ్రీకాంత్ పైన ఉన్న ప్రేమ అభిమానంతో వాలంటీర్ దుర్గాప్రసాద్ అతని కొడుకు పేరు కూడా శ్రీకాంత్ అని పెట్టుకున్నాడని మంత్రి సుభాష్ గుర్తు చేశారు. దుర్గాప్రసాద్ ను హత్య చేసిన తర్వాత గత రెండు సంవత్సరాలుగా ఆ కేసు దర్యాప్తు జరగకుండా మాజీమంత్రి విశ్వరూప్ అడ్డుకున్నారని మంత్రి సుభాష్ ఆరోపించారు.

అంతేకాకుండా దుర్గాప్రసాద్ భార్యతో రాజీ అయిన మంత్రి విశ్వరూప్ ఆమెకు రెండు ఎకరాల భూమి ఇస్తానని మాట ఇచ్చారని, అయితే ఇప్పటివరకు కనీసం అంగుళం భూమి కూడా ఇవ్వలేదని మంత్రి సుభాష్ ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని దుర్గాప్రసాద్ భార్య తన దగ్గరకు వస్తే ఆమెను డీజీపీ, ఐజీ దగ్గరకు తీసుకెళ్లాలని మంత్రి సుభాష్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+