పవన్ కంటే సన్నాసి ఎవరూ లేరు : చిరంజీవి లేకపోతే ఆయన లేరు : మంత్రి వెల్లంపల్లి ఫైర్..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన మంత్రి వెల్లంపల్లి తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యారు. రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏపీ ప్రభుత్వం పైన పవన్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి వెల్లంపల్లి కౌంటర్ ఇచ్చారు. మంత్రి పేర్ని నాని ని పవన్ కళ్యాణ్ సన్నాసి అంటూ వ్యాఖ్యానించటం పైన వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేసారు. పవన్ కంటే పెద్ద సన్నాసి ఎవరూ లేరంటూ ఫైర్ అయ్యారు. బ్లాక్ లో టిక్కెట్లు అమ్ముకొనే వ్యక్తి పవన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రభుత్వం సామాన్యులకు భారం తగ్గించేందుకు టిక్కెట్లు అమ్మితే తప్పేంటని మంత్రి ప్రశ్నించారు.

ఎవరు డబ్బులిస్తే వారికి మద్దతుగా మాట్లాడే పావలా పవన్ కళ్యాణ్ గురించి తాము పట్టించుకోమని తేల్చి చెప్పారు. రాజకీయంగా ఎదగలేని నిరాశతో పవన్ మాట్లాడుతున్నారని మంత్రి చెప్పుకొచ్చారు. ప్రజలను దోచుకొనేందుకు పవన్ మద్దతిస్తున్నారంటూ మండి పడ్డారు. చిరంజీవి లేకపోతే పవన్ లేరని మంత్రి వ్యాఖ్యానించారు. పవన్ రెమ్యునరేషన్ ఎందుకు తగ్గించుకోరని ప్రశ్నించారు. సినీ పరిశ్రమ నుంచి చిరంజీవితో పాటుగా మరి కొందరు పెద్దలు అడిగితేనే ప్రభుత్వం ఆన్ లైన్ టిక్కెట్ల ప్రతిపాదన పైన చర్చలు చేస్తోందని మంత్రి వివరించారు.

దీని ద్వారా పవన్ కు వచ్చే నష్టం ఏంటని నిలదీసారు. సినిమా పేరు చెప్పుకొని బతుకుతున్నావని..ప్రజలకు టిక్కెట్ ధరలు తగ్గకూడదని చెప్పే పవన్..ఇక ప్రజలకు ఏం సేవ చేస్తావంటూ వెల్లంపల్లి ప్రశ్నించారు. వకీల్ సాబ్ లో ప్రకాశ్ రాజ్ యాక్టింగ్ లో పావు వంతు కూడా పవన్ యాక్టింగ్ చేయలేకపోయారంటూ ఎద్దేవా చేసారు. ప్రజల జేబులు గుల్ల చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. తనతో ఢీ కొట్టమని పవన్ అంటున్నారని..అసలు నీ దగ్గర ఏముంది ఢీ కొట్టటానికి అంటూ ప్రశ్నించారు.

Minister Vellampalli Srinivas counter attack on Pawan Kalyan

రెండు చోట్ల.. నీకు మద్దతుగా నిలిచే సామాజిక వర్గాలు బలంగా ఉన్న చోట పోటీ చేసి రెండు స్థానాల్లోనూ ఓడిపోయావంటూ మంత్రి దుయ్యబట్టారు. విజయవాడ కార్పోరేషన్ లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేక పోయావని ఎద్దేవా చేసారు. సీఎం - మంత్రుల పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమంటూ మంత్రి వెల్లంపల్లి జనసేన అధినేత పవన్ ను హెచ్చరించారు. మంత్రి వెల్లంపల్లి వర్సెస్ జనసేన అన్నట్లుగా చాలా రోజులుగా విమర్శలు కొనసాగుతున్నాయి.

విజయవాడ జనసేన నేతలు మంత్రి వెల్లంపల్లిని టార్గెట్ చేస్తూ అనేక సందర్బాల్లో ఆరోపణలు గుప్పించారు. పవన్ ఏపీ ప్రభుత్వం పైన చేసిన సంచలన ఆరోపణల పైన ఇతర మంత్రులు సైతం కౌంటర్ ఎటాక్ చేయటానికి సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో..పవన్ వ్యాఖ్యలతో ఇప్పుడు ఏపీలో కొత్తగా సినిమా పరిశ్రమ కేంద్రంగా రాజకీయ రగడ కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక, మంత్రి పేర్ని నాని పైన పవన్ చేసిన వ్యాఖ్యల పైన వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+