చంద్రబాబు ను దాటేసిన జగన్ - లెక్క తేల్చిందిలా...!?

చంద్రబాబు పాలన కంటే జగన్ ప్రభుత్వం సాధించిన పురోగతిని అంకెలతో విశ్లేషణ చేసారు.

ఏపీ అభివృద్ది విషయంలో ప్రతిపక్షాలు సీఎం జగన్ ను టార్గెట్ చేస్తున్నాయి. జగన్ సీఎం అయిన తరువాత ఏపీకి పెట్టబడులు రాలేదని ఆరోపిస్తున్నాయి. సంక్షేమం విషయంలో మాత్రం తాము అధికారంలోకి వస్తే జగన్ కంటే మెరుగ్గా పథకాలు అందిస్తామని చెబుతున్నాయి. ఈ సమయంలో ప్రభుత్వం కీలక గణాంకాలు విడుదల చేసింది. ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ ప్రభుత్వం తాము సంక్షేమం - అభివృద్ది రంగాల్లో ఏ రకంగా సక్సెస్ సాధించిందీ వివరించింది. చంద్రబాబు హయాం తో ప్రస్తుతం తమ ప్రభుత్వం సాధించిన పురోగతిని అంకెలతో విశ్లేషణ చేసారు ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.

చంద్రబాబు- జగన్ పాలనలో ఇలా

చంద్రబాబు- జగన్ పాలనలో ఇలా


వైసీపీ ప్రభుత్వ హాయంలో పారిశ్రామికాభివృద్ధి గత పాలన కంటే మెరుగ్గా ఉందని.. అధిక పెట్టుబడులు సాధించిన రాష్ట్రంగా లెక్కలు చెబుతున్నాయని వివరించారు. ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని మంత్రి తెలిపారు. సంక్షేమ పథకాల ద్వారా ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా రూ 1.98 లక్షల కోట్లు అందించినట్లు మంత్రి చెల్లుబోయిన వెల్లడించారు. ఏపీ డీజీపీ రేటు 11.43 శాతం ఉందని చెప్పారు. జాతీయ జీడీపీ 8.7 శాతం ఉండగా.. జాతీయ సగటు కంటే ఏపీ జీఎస్డీపీ 2.73 శాతం ఎక్కువ ఉందని విశ్లేషించారు. కోవిడ్ సమయంలో దేశం వృద్ది రేటు మైనస్ 6.60% ఉంది. మన రాష్ట్రం 0.08% శాతం వృద్దిరేటు ఉంది. దేశంలోనే తలసరి ఆదాయంలో ఏపీ 6వ స్థానంలో ఉందన్నారు. చంద్రబాబు పాలనలో వృద్ధి రేటు 5.36 శాతమేనని చెప్పారు. వైయ‌స్‌ జగన్‌ సీఎం సీఎం అయ్యాక వృద్ధి రేటు 11.43 శాతానికి చేరిందని మంత్రి వివరించారు.

లెక్కలు ఏం చెబుతున్నాయి

లెక్కలు ఏం చెబుతున్నాయి


డీపీఐఐపీ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 2022 జూలై చివరి నాటికి లక్షా 71వేల 285 కోట్లు పెట్టుబడులు వచ్చాయని మంత్రి వెల్లడించారు. అందులో 40,361 కోట్ల పెట్టుబడులు ఏపీ సాధించిందని చెప్పారు. 2022 డిసెంబర్‌లో జగన్ పాలనలో 23,985 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపిందని వివరించారు, ఇతర రాష్ట్రాలతో పోల్చితే పెట్టుబడులు సాధించడంలో ఏపీది 5 వ స్థానంలో నిలిచిందన్నారు. పరిశ్రమల స్థాపనలో ఏపీది 3వ స్థానంగా పేర్కొన్నారు. దక్షిణాదిరాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానంలో ఉందని వెల్లడించారు. పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ స్థాయి సంస్థలు ముందుకొస్తున్నాయని చెప్పారు. నాలుగేళ్ల నుంచి ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఏపీనే నెంబర్ ఒన గా నిలిచిందని మంత్రి చెల్లుబోయిన వివరించారు.

సంక్షేమం - అభివృద్ది

సంక్షేమం - అభివృద్ది


2022 జూన్‌లో బీఆర్ఏపీ ఇచ్చిన రేటింగ్‌లో ఏపీ అగ్రస్థానంలో నిలిచిందని చెప్పారు బల్క్ డ్రగ్ పార్క్ గ్రాంట్ కోసం దక్షిణాది రాష్ట్రాలన్నీ పోటీ పడితే వెయ్యికోట్ల గ్రాంట్ ఏపీకి దక్కిందని గుర్తు చేసారు. ఎంఎస్ఎంఈలకు మార్కెట్లో విస్తృత ప్రాధాన్యతను కల్పించామని వివరించారు. కోవిడ్ సమయంలో రీస్టార్ట్ ప్యాకేజీని పొడిగించామన్నారు. రైతులను ఆదుకోవడానికి ఆర్బీకేలను ఏర్పాటు చేశాం. రైతులు మోసపోకుండా చర్యలు తీసుకున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని చెప్పుకొచ్చారు. అమూల్ సహకారంతో పాడి రైతులు నష్టపోకుండా చూశామన్నారు. చంద్రబాబు పాలనలో పెట్టుబడుల నుంచి అన్నీ అంకెలతో మాయ చేసారని మంత్రి ఆరోపించారు. తాము ప్రచారాలకు దూరంగా వాస్తవాలకు దగ్గరగా పెట్టబడులు..ఉపాధి పైన ఫోకస్ చేసామని మంత్రి చెల్లుబోయిన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+