సినిమా రంగంలోకి మంత్రి విడుదల రజిని

హైదరాబాద్ లో సినిమాలు తీయడానికి కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన మంత్రి రజిని

సినిమాలు.. రాజకీయం.. ఒకదానికొకటి విడదీయరాని కవల పిల్లల్లాంటివి. సినీ రంగంలో ఉన్నవారు తర్వాత చూపు రాజకీయాలపై పడుతుంది. అలాగే రాజకీయం రంగంలో ఉన్నవారు సినీరంగంలోకి ప్రవేశిస్తారు. తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇటువంటి సంఘటనలు కోకొల్లలు. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించడం, ఆ తర్వాత ఎంతోమంది సినీ తారలు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. రాజకీయాల్లో ఉంటూ సినిమాలు నిర్మించనవారు కోకొల్లుగా ఉన్నారు. ఈ బాటలోనే ఏపీకి చెందిన మంత్రి విడుదల రజిని అడుగుపెట్టబోతున్నారు. ఇప్పటికే ఒక నిర్మాణ సంస్థను స్థాపించి, ఫిలింనగర్ లో కార్యాలయం కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. మంత్రి నిర్మించే తొలి సినిమాకు కథ సిద్ధమైందని, దర్శకుడు, కథానాయకుడు కూడా సిద్ధమయ్యారని, అధికారికంగా ప్రకటించడమే తరువాయి అంటున్నారు.

రాజకీయ రంగం నుంచి సినీ రంగంలోకి ప్రవేశించి ఆర్టిస్టులుగా విజయవంతమైనవారున్నారు. అలాగే కొందరు రాజకీయ నాయకులు తెరవెనక ఉండి తెరముందు వేరేవారితో నడిపస్తున్న సందర్భాలున్నాయి. ఈ సినిమాకు సంబంధించి విడుదల రజని అధికారికంగానే ప్రకటిస్తారా? ఇతరుల పేర్లేమైనా ప్రకటిస్తారా? అనే విషయం తెలియాల్సి ఉంది.

Minister vidudala Rajini into the film industry

2014లో తెలుగు దేశం పార్టీ త‌ర‌పున‌ చిల‌క‌లూరి పేట నియోజ‌క వ‌ర్గం నుంచి విడద‌ల రజిని త‌న రాజ‌కీయ జీవితాన్ని ఆరంభించారు. ఆ త‌ర్వాత జ‌రిగిన రాజ‌కీయ ప‌రిణామాల‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2019 ఎన్నికలకు పేట టికెట్ ను దక్కించుకున్నారు. రెండోసారి మంత్రివర్గ విస్తరణలో భాగంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+