వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు ఆదేశం, రంగంలోకి మంత్రులు: జగన్‌కు మాటిచ్చా, ఇదీ నా బాధ... శిల్పా షాక్

జగన్మోహన్ రెడ్డి సమక్షంలో బుధవారం ఆ పార్టీలో చేరాలనుకున్న శిల్పా మోహన్ రెడ్డిని బుజ్జగించేందుకు టిడిపి సీనియర్ నేతలు, పలువురు మంత్రులు ప్రయత్నాలు చేశారని తెలుస్తోంది.

|
Google Oneindia TeluguNews

కర్నూలు: వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో బుధవారం ఆ పార్టీలో చేరాలనుకున్న శిల్పా మోహన్ రెడ్డిని బుజ్జగించేందుకు టిడిపి సీనియర్ నేతలు, పలువురు మంత్రులు ప్రయత్నాలు చేశారని తెలుస్తోంది.

చదవండి: జగన్ పార్టీలోకి వెళ్తున్నానంటూ.. బాబుపై శిల్పా తీవ్ర వ్యాఖ్యలు

అయితే, ఆయన మాత్రం ససేమీరా అన్నారని తెలుస్తోంది. తాను జగన్‌కు మాట ఇచ్చానని, ఇక టిడిపిలో ఉండేది లేదని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతానని సూటిగా మంత్రులకే చెప్పారని తెలుస్తోంది.

మంత్రులను రంగంలోకి దింపిన చంద్రబాబు

మంత్రులను రంగంలోకి దింపిన చంద్రబాబు

శిల్పా మోహన్ రెడ్డి ఆదివారం నాడు తన వర్గం కౌన్సెలర్లతో సమావేశమయ్యారు. ఆయన పార్టీ మారుతారని తెలియడంతో.. పార్టీ అధిష్టానం మంత్రులు, కొందరు సీనియర్ నేతలను రంగంలోకి దింపిందని తెలుస్తోంది. ఆ సమయంలో వారు ఆయనతో మాట్లాడారని సమాచారం.

ఇప్పటికే హామీ ఇచ్చా..

ఇప్పటికే హామీ ఇచ్చా..

అయితే శిల్పా మోహన్ రెడ్డి వారికి సూటిగా విషయం చెప్పారని తెలుస్తోంది. తాను వైసిపిలో చేరుతానని ఇప్పటికే జగన్‌కు హామీ ఇచ్చానని, ఆ మేరకు వెళ్తున్నానని చెప్పారని తెలుస్తోంది. అలాగే, టిడిపిపై తన అసంతృప్తిని కూడా ఆయన వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఇటీవల జరుగుతున్న పరిణామాలు తనను ఆందోళనకు, ఆవేదనకు గురి చేస్తున్నాయని చెప్పారని తెలుస్తోంది.

అఖిలప్రియ దూకుడు..

అఖిలప్రియ దూకుడు..

మంత్రి అఖిలప్రియ దూకుడుగా వెళ్లడాన్ని కూడా ఆయన పార్టీ సీనియర్లకు చెప్పారని తెలుస్తోంది. నియోజకవర్గంలో పింఛన్లు, పంపాకల విషయంలో తమను సంప్రదించకుండా కార్యకలాపాలు సాగిస్తున్నారని చెప్పారు. తనకు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పోతోందని, కాబట్టి తనకు మరో ఆప్షన్ లేదని చెప్పారని తెలుస్తోంది. టిడిపిలో కొనసాగే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు.

టిడిపికి ఊహించని దెబ్బ

టిడిపికి ఊహించని దెబ్బ

శిల్పా మోహన్ రెడ్డి టిడిపికి గుడ్ పై చెప్పి ఈ నెల 14న వైసిపిలో చేరనున్నారు. ఇది టిడిపికి దెబ్బే. శిల్పా నిర్ణయం నంద్యాలలో టిడిపికి ఊహించని దెబ్బ అంటున్నారు. టిడిపిలో అడుగడుగునా అవమానాలు ఎదుర్కొన్నానని, కార్యకర్తలు, ఎంపీటీసీలు, సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని కూడా శిల్పా వ్యాఖ్యానించడం గమనార్హం.

టిడిపిలోనే ఉంటానని శిల్పా చక్రపాణి రెడ్డి

టిడిపిలోనే ఉంటానని శిల్పా చక్రపాణి రెడ్డి

తాను తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని శిల్పా మోహన్ రెడ్డి సోదరుడు శిల్పా చక్రపాణి రెడ్డి స్పష్టం చేశారు. తాను చంద్రబాబు ఆదేశాలను శిరసా వహిస్తానని చెప్పారు. తాను టిడిపిని వీడేది లేదన్నారు. అన్నదమ్ముల అనుబంధం వేరని, రాజకీయాలు వేరని తెలిపారు. కాగా, మండలి చైర్మన్, జిల్లా అధ్యక్ష ఎన్నికలు ఉండటంతో చక్రపాణి రెడ్డి ఇలా మాట్లాడుతున్నారా అనే చర్చ సాగుతోంది.

English summary
The inevitable has happened in Kurnool. Shilpa Mohan Reddy had decided to quit TDP and join YSR Congress ahead of Nandhyala By-election. Shilpa himself told this to media and declared that he will join the main opposition party on 14th of this month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X