పాలప్యాకెట్ తెస్తూ...కామాంథుడి బారిన పడిన మైనర్ బాలిక

గుంటూరు: నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. ఇంటి నుంచి పాలప్యాకెట్ తెచ్చేందుకని బైటకు వెళ్లిన ఓ మైనర్ బాలికను కామంతో కళ్లు మూసుకుపోయిన దుర్మార్గుడు బలవంతంగా తన ఇంట్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకానిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం...చినకాకానికి చెందిన ఓ మైనర్ బాలికకు తల్లిదండ్రులు లేరు. దీంతో ఆ బాలిక తన బాబాయి ఇంట్లో ఆశ్రయం పొందుతోంది. అయితే ఆదివారం ఉదయం ఈ బాలిక పాలప్యాకెట్ తెచ్చేందుకని సమీపంలోని కిరాణా స్టోర్ కు వెళ్లింది. అయితే తిరిగి వస్తుండగా హనీఫ్ అనే వ్యక్తి ఈ బాలికను మార్గ మధ్యంలో అడ్డగించి బెదిరించి తన ఇంట్లోకి లాక్కెళ్లాడు. ఆ తరువాత తన ఇంట్లోనే ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

Minor girl allegedly raped in Capital area

అత్యాచారం అనంతరం ఈ విషయం బైటకు చెబితే చంపేస్తానని బెదిరించి వదిలేశాడు. ఇంటికి తిరిగి వచ్చిన బాలిక ఈ విషయాన్ని తన బాబాయి,పిన్నిలకు తెలియజేసింది. దీంతో ఈ బాలికకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ మైనర్ బాలిక బాబాయి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+