Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అన్నతో లవ్.. మందలించినందుకు మైనర్ బాలిక ఏం చేసిందంటే ??

ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లాలో చోటుచేసుకున్న ఒక విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. మొదట ఇది సోషల్ మీడియా రీల్స్ చిత్రీకరణ సమయంలో జరిగిన ప్రమాదమని భావించినా.. అనంతర విచారణలో మరో కోణం బయటపడింది. పెద్దమ్మ కొడుకుతోనే ఓ యువతి ప్రేమలో పడి అతడినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. అయితే విషయం తెలిసిన తల్లి.. అన్నయ్యతో ప్రేమ ఏంటని కుమార్తెపై మండిపడింది. దీంతో మనస్థాపానికి గురై భవనంపై నుంచి దూకి యువతి సూసైడ్ చేసుకోవడం తీవ్ర విషాదం నింపుతోంది.

అసలేం జరిగిందంటే..

స్థానిక రాజారెడ్డి కాలనీలో నివసిస్తున్న ఒక కుటుంబానికి చెందిన 13 ఏళ్ల బాలిక ఈ ఘటనలో మృతిచెందింది. నేపాల్‌కు చెందిన ధను బహదూర్ దంపతులు జీవనోపాధి కోసం ఇక్కడికి వలస వచ్చి ఒక అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తూ అక్కడే నివసిస్తున్నారు. వారి కుమార్తె సోషల్ మీడియా రీల్స్ చేయడంపై ఆసక్తి పెంచుకుంది. కానీ అనూహ్యంగా బాలిక కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెతుకుతూ అపార్ట్‌మెంట్ పై అంతస్తుకు వెళ్లగా.. కింద పడిపోయిన దృశ్యం గమనించి షాక్‌కు గురయ్యారు. కళ్లముందే బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులను చూసి స్థానికులు సైతం కంటతడి పెడుతున్నారు.

minor-girl-committed-suicide-due-to-love-issue-at-tirupathi-creates-sad-among-family-and-locals

అయితే ప్రారంభంలో బాలిక అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తులో రీల్స్ చిత్రీకరిస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడిపోయిందని భావించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. అనంతరం పోలీసులు లోతుగా విచారణ జరపగా, కుటుంబంలో జరిగిన గొడవ ఈ ఘటనకు కారణమై ఉండొచ్చని అనుమానం వ్యక్తమైంది. బాలిక తన పెద్దమ్మ కొడుకుతో సన్నిహితంగా ఉండటం, అతడినే పెళ్లి చేసుకోవాలని కోరుకోవడం కుటుంబంలో వివాదానికి దారితీసినట్లు సమాచారం.

దాంతో తల్లి తీవ్రంగా మందలించడంతో బాలిక భావోద్వేగానికి లోనైనట్లు తెలుస్తోంది. ఆవేశంలో తీసుకున్న తప్పుడు నిర్ణయం ఆమె ప్రాణాన్ని బలిగొంది. దీంతో మొదట అనుమానంగా కనిపించిన ఈ ఘటన, అనంతరం ఆత్మహత్యగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనతో స్థానికంగా విషాద వాతావరణం నెలకొంది. ఒకవైపు సోషల్ మీడియా ప్రభావం.. మరోవైపు చిన్న వయసులోనే ప్రేమ అంటూ మాయలో పడిపోయి క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు ఎంతటి విషాదానికి దారి తీస్తుందో బయటపడుతుంది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+