అక్క కూతుర్ని బలవంతంగా వ్యభిచారంలోకి దింపిన పిన్ని
ఒంగోలు: ఓ మహిళ తన అక్క కూతురును వ్యభిచార కూపంలోకి దింపిన సంఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. అక్రమ రవాణాకు గురై వ్యభిచార వృత్తిలో అవస్థలు పడుతున్న వేటపాలెంకు చెందిన 17 ఏళ్ల బాలికను చైల్డ్ లైన్ సంస్థ శనివారం రక్షించింది.
వేటపాలెంకు చెందిన బాలిక కూలీ పనులకు వెళ్తోంది. ఇటీవల నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని అల్లూరులో ఉండే పిన్ని వేటపాలెం వచ్చింది. ఐదు రోజులు తన ఊరుకు తీసుకు వెళ్తానని చెప్పింది. ఆమె తన అక్క కూతురును అల్లూరులో నిర్మల అనే మహిళకు అప్పగించింది.

నిర్మల ఆమెతో రెండు రోజుల పాటు బలవంతంగా వ్యభిచారం చేయించింది. బాలిక చైల్డ్ లైన్ ప్రతినిధులకు సమాచారం అందించింది. దీంతో వారు ఆమెను శనివారం నాడు రక్షించారు. వ్యభిచార కూపంలోకి దింపుతున్న నిర్మలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా, బాధితురాలి కుటుంబ సభ్యులు ఆ పిన్నికి పలుమార్లు ఫోన్ చేసినా ఆమె ఏదో సమాధానం చెప్పేది. పదేపదే ఫోన్ చేస్తుండటంతో.. తాను ఎప్పుడో మీ ఇంటికి పంపించానని ఓసారి ఘాటుగా సమాధానం కూడా చెప్పింది.
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
చరిత్ర సృష్టించిన భారత ఆయిల్ ట్యాంకర్ 'జగ్ విక్రమ్'.. 20 వేల టన్నుల LPGతో హార్మూజ్ ను దాటి..











Click it and Unblock the Notifications