నీలి చిత్రాలు చూపిస్తూ ఏడాదిగా మైనర్ బాలికపై అత్యాచారం

మానవత్వాన్ని మరిచాడు. కూతురు వరసైన తొమ్మిదేళ్ళ చిన్నారిపై ఏడాదిగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. నీలి చిత్రాలూ చూపిస్తూ మరీ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్న డ్రైవర్ ఉదంతం ఒకటి నెల్లూరు జిల్ల

నెల్లూరు :మానవత్వాన్ని మరిచాడు. కూతురు వరసైన తొమ్మిదేళ్ళ చిన్నారిపై ఏడాదిగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. నీలి చిత్రాలూ చూపిస్తూ మరీ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్న డ్రైవర్ ఉదంతం ఒకటి నెల్లూరు జిల్లాలో చోటుచేసుకొంది.

నెల్లూరు జిల్లా సైదాపురం మండలానికి చెందిన ఓ మహిళకు ఇద్దరు మగపిల్లలు, ఒక అమ్మాయి. భర్త చనిపోవడంతో బతుకుదెరువు కోసం పిల్లలతో కలిసి నెల్లూరుకు వచ్చింది. నెల్లూరులో డ్రైవర్ గా పనిచేస్తోన్న పెంచలయ్య అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త సహాజీవనానికి దారితీసింది.పెంచలయ్య భార్య, పిల్లలను వదిలేశారు.

minor girl rape by a driver in nellore

ఉదయం పూట ఆ మహిళ ఇళ్ళల్లో పాచిపనులకు వెళ్తుండేది. పెంచలయ్య డ్రైవర్ గా పనిచేస్తుండేవాడు. ఆ మహిళ కుమార్తైపై పెంచలయ్య కన్ను పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పెంచలయ్య ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఏడాదిగా ఈ దారణాన్ని కొనసాగిస్తున్నాడు.

నీలి చిత్రాలను చూపిస్తూ మరీ ఆ మైనర్ బాలికపై పెంచలయ్య రేప్ చేస్తున్నాడు. అయితే ఈ విషయాన్ని స్కూల్లోని తన స్నేహితురాలికి ఆ బాలిక చెప్పడంతో విషయం వెలుగుచూసింది. ఐసిడిఎస్ అధికారులకు ఉపాధ్యాయులు ఫిర్యాదు చేశారు. బాధితులతో పాటు ఐసిడిఎస్ అధికారులు పెంచలయ్యపై ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదుచేసి విచారిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+