మైనర్ బాలికపై యువకుడి అత్యాచారం

Posted By:
Subscribe to Oneindia Telugu

సామర్లకోట:సభ్య సమాజం తలదించుకొనేవిధంగా ఐదవ తరగతి చదివే బాలికపై సుబ్బారావు అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సామర్లకోటలోని బ్రౌన్ పేటకు చెందిన బాలిక ఐదవ తరగతి చదువుతోంది. శనివారం నాడు ఆమె స్కూల్ కు వెళ్ళి తిరిగి వచ్చి స్నాక్స్ ను కొనుగోలు చేసేందుకుగాను తమ ఇంటికి సమీపంలోని దుకాణానికి వెళ్ళింది.

గంటా సుబ్బారావు అనే యువకుడు బాలిక చేయి పట్టుకొని లాగాడు. ప్రతిఘటించి వచ్చేస్తున్న బాలికను సుబ్బారావు కొట్టాడు. దీంతో ఆ బాలిక అపస్మారకస్థితిలోకి వెళ్ళింది.

minor girl raped by man in east godavari district

తర్వాత ఆ బాలికను మరుగుదొడ్డిలోకి తీసుకెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డాడు. కొంతసేపటికి ఆ బాలికకు స్పృహ వచ్చింది. బాత్ రూమ్ తలుపువేసి ఉండడంతో కేకలు వేసింది.

దీంతో స్థానికులు తలుపు తీశారు.బాధితురాలు కుటుంబసభ్యులకు సమాచారాన్ని తెలిపింది.బాధితుల కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారనే ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
minor girl raped by man in east godavari district on saturday.victim family members compliant against subbarao.
Please Wait while comments are loading...