మైనర్ గర్ల్‌పై రేప్: మాట్లాడ్తానని.. బెదిరించి నెల్లూరులో

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. ఇచ్ఛాపురం మండలం తులసిగాం గ్రామంలో 16 సంవత్సరాల మైనర్ బాలిక శుక్రవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమెపై అత్యాచారం చేసి, ఆపై హత్య చేసి ఉంటారని సంఘటనా స్థలంలో లభించిన ఆనవాళ్లను బటి అనుమానిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం 10వ తరగతి వరకు చదువుకున్న బాలిక తన నాన్నమ్మతో కలిసి తులసిగాంలోని వడ్డివీధిలో నివాసముంటోంది. శుక్రవారం నానమ్మ బంధువుల ఇంటికి పర్లాకిమిడికి వెళ్లగా, బాలిక ఒంటిరిగా ఇంట్లో నిద్రించింది. శనివారం ఉదయం స్థానికులు గదిలో నేలపై ఆమె మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

శరీరం, ముఖంపై గాట్లతోపాటు రక్తం మరకలు ఉన్నాయి. డిఎస్పీ దేవప్రసాద్, సిఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ రామారావు సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. రాత్రి వేళ ఒంటిరిగా నిద్రిస్తుండడంతో గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి ఆపై హత్య చేసి ఉంటారని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Minor girl raped in Srikakulam

నెల్లూరులో..

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో ఇంటర్ విద్యార్థినిపై అదే గ్రామానికి చెందిన యువకుడు అత్యాచారం చేశాడు. విషయం బయటకు పొక్కడంతో బాధిత బాలిక తల్లిదండ్రులు పెళ్లి ప్రతిపాదన చేయగా ముందు అంగీకరించి తర్వాత ససేమిర అనడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పట్టణంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజ్‌లో ఓ విద్యార్థిని ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతోంది.

పట్టణంలోని ఓ వెల్డింగ్‌షాపులో పని చేసే యువకుడు ఆ విద్యార్థిని ప్రేమిస్తున్నానంటూ గత కొంతకాలంగా వేధించేవాడు. ఈ విషయం తెలిసి ఆమె కుటుంబ సభ్యులు యువకుడిని మందలించారు. అయినా అతనిలో మార్పు రాలేదు. గత గురువారం కాలేజీకు వెళ్తున్న ఆ విద్యార్థినిని ఆ యువకుడు మోటార్‌ సైకిల్‌పై వెంబడించి అడ్డగించాడు. 10 నిమిషాలు నాతో మాట్లాడితే ఇకపై నీ జోలికి రాను, లేకుంటే చంపేస్తానని బెదిరించాడు.

విధిలేని పరిస్థితుల్లో యువకుడి మాటలు నమ్మిన ఆ విద్యార్థిని అతనితో వెళ్లింది. ఖాళీగా ఉన్న ఓ ఇంట్లోకి విద్యార్థిని తీసుకుని వెళ్లిన ఆ యువకుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పెళ్లి చేయాలని మధ్యవర్తిత్వం నెరిపారు. వివాహానికి యువకుడు ఒప్పుకోకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని కోరారు. నిందితుడు పరారైనట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+