భగభగ మండుతోన్న వైఎస్సార్ విగ్రహం
YS Jagan Mohan Reddy: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. తన దూకుడును కొనసాగిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన భవనాల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించడం ఖాయంగా కనపిస్తోంది.
రాజధాని అమరావతి పరిధిలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని చంద్రబాబు ప్రభుత్వం కూల్చివేసిన విషయం తెలిసిందే. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న పార్టీ కార్యాలయం ఇది. రెండు ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణంలో ఉన్న భవనాన్ని సీఆర్డీఏ అధికారులు కూల్చివేశారు. బుల్‌డోజర్లు, ప్రొక్లెయినర్లతో నేలమట్టం చేశారు.

అదే సమయంలో విశాఖపట్నంలో కొత్తగా నిర్మితమైన భవనానికీ నోటీసులు జారీ చేశారు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. అక్రమ కట్టడమని, నిర్మాణంలో ఉల్లంఘటనలు చోటు చేసుకున్నాయంటూ నోటీసులు ఇచ్చారు. దాన్ని పార్టీ కార్యాలయానికి అతికించి వెళ్లారు. అనంతపురం, రాజమండ్రి..ఇలా దాదాపుగా పలు జిల్లాల్లో పార్టీ కార్యాలయాలకు నోటీసులు అందాయి.
దీనిపై వైఎస్ఆర్సీపీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై తీర్పు రిజర్వ్‌లో ఉంది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు స్టేటస్- కోను కొనసాగించాలంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం ఈ కూల్చివేతలకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్టయింది.
అదే సమయంలో- రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తల ఇళ్లపై దాడులు చేశారు తెలుగుదేశం శ్రేణులు. ఈ దాడుల్లో పలువురు గాయపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాల విధ్వంసం సైతం కొనసాగుతూనే ఉంది. అనేక చోట్ల విగ్రహాలను ధ్వంసం చేశారు. కొన్నింటిని కూలగొట్టారు.
తాజాగా- వైఎస్సార్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టారు. బాపట్ల జిల్లాలోని భట్టిప్రోలు మండలం అద్దెపల్లి దళితవాడలో గల వైఎస్సార్ విగ్రహంపై పెట్రోల్ పోసి నిప్పింటించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తెలుగుదేశం పార్టీ నాయకులే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది.
💔💔💔 pic.twitter.com/U63jpKnw6O
— MBYSJTrends ™ (@MBYSJTrends) June 29, 2024
ఈ ఘటనకు నిరసనగా పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. అద్దెపల్లిలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ నినదించారు. దీనితో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications