వెంకటేష్ హీరోగా పవన్ కల్యాణ్ డైరెక్షన్ లో మిస్సయిన చిత్రం
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే అభిమానులు పూనకాలు వచ్చినట్లు ఊగిపోతారు. సినిమాల్లోనే కాదు.. రాజకీయంగా కూడా. ప్రస్తుతం పవన్ ఎక్కడ పర్యటిస్తున్నా అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. హీరోగా కెరీర్ ప్రారంభించినప్పుడు స్తబ్ధుగా ఉన్న తెలుగు సినీ పరిశ్రమకు సరికొత్త ట్రెండింగ్ ను పరిచయం చేస్తూ మెరుగులద్దారు.

పవన్ నుంచి విడుదలయ్యే ప్రతి సినిమా సూపర్ హిట్ కావాల్సిందే. 'అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి' నుంచి 'ఖుషీ' వరకు ట్రెండ్ సెట్ చేసిన సినిమాలే. తర్వాత కొంత గ్యాప్ తో జానీ చేశారు. పవన్ కల్యాణ్ దర్శకత్వంలోనే ఈ చిత్రం రూపుదిద్దుకుంది. అయితే అది డిజాస్టర్ గా మిగిలి పవన్ కు మొదటి ఫ్లాప్ ను అందించింది. ఈ సినిమాకన్నా ముందుగా వెంకటేష్ కథానాయకుడిగా పవన్ కల్యాణ్ దర్శకత్వంలో ఓ సినిమాకు సన్నాహాలు జరిగాయి.

దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ను కూడా పవన్ కల్యాణ్ పూర్తిచేసుకున్నాడు. నటీనటులను ఎంపిక చేసే విషయంలో కొంతమంది కాల్షీట్లు దొరకలేదు. దీంతో సినిమా తీయడానికి డేట్లు అడ్జస్ట్ కాలేదు. వేరే ఆర్టిస్టులతో సినిమాను పూర్తిచేయవచ్చుకానీ పవన్ కల్యాణ్ ఆలోచనల్లో వారు లేదరు. ముందుగా తాను అనుకున్నవారైతేనే క్యారెక్టర్లు పండుతాయనే అభిప్రాయంతో ఉన్నారు. అయితే వారి డేట్లు మాత్రం సర్దుబాటు కాకపోవడంతో షూటింగ్ రద్దయింది. ఆ తర్వాత పవన్ జానీ సినిమా మీద దృష్టిపెట్టారు. జానీని కొద్దికాలం వాయిదా వేసి వెంకటేష్ సినిమామీద దృష్టి పెట్టివుంటే క్రేజీ కాంబినేషన్ మూవీని చూసే అదృష్టం తెలుగు ప్రేక్షకులకు దక్కేది.












Click it and Unblock the Notifications