లోకేష్ లాగే బాబు: ట్విట్టర్‌లో బిగ్ మిస్టెక్.. మహిళలపై ఇలా..
ఆపదలో ఉన్న మహిళలను 'ఆడుకోవడమే' లక్ష్యంగా 181 కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని అందులో పేర్కొనడం గమనార్హం.
Recommended Video

Chandrababu Naidu's twitter post trolls ట్విట్టర్‌లో మిస్టెక్.. విమర్శల వెల్లువ | Oneindia Telugu
హైదరాబాద్: బహిరంగ వేదికల పైనా, పార్టీ సమావేశాల్లో నోరు జారిన మంత్రి లోకేష్ చాలాసార్లు విమర్శలు మూటగట్టుకున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఆయన తత్తరపాటుకు లోనవడం.. ఆపై చాలా ప్రసంగాల్లో అదే తరహా తప్పులు దొర్లుతూ రావడం ఆయనకు పెద్ద మైనస్ అయ్యాయి.

తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా తప్పులో కాలేశారు. మహిళా రక్షణ కోసం ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ గురించి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. అందులో ఆపదలో ఉన్న మహిళలను ఆడుకోవడమే లక్ష్యంగా 181 కాల్ సెంటర్ ఏర్పాటు చేశాము. గృహహింస, ఈవ్ టీజింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ సమస్యలకు పరిష్కారమవుతాయ'ని ట్వీట్ చేశారు. ఆదుకోవడమే అని కాకుండా ఆడుకోవడమే అని పేర్కొనడం విమర్శలకు తావిచ్చేదిగా మారింది.












Click it and Unblock the Notifications