• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అల్లుడుకు పోటీగా బాలయ్య - హిందూపురం కేంద్రంగా..!!

|
Google Oneindia TeluguNews

ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇప్పుడు రాజకీయంగా అల్లుడు లోకేశ్ తో పోటీ పడుతున్నారు. హిందూపురంలో వరుసగా రెండు సార్లు గెలిచిన బాలయ్య.. హ్యాట్రిక్ కొట్టేందుకు నియోజకవర్గంలో అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా.. తన సొంత నిధులతో వైద్య సేవలు ప్రారంభించేందుకు నిర్ణయించారు. టీడీపీ నేత లోకేశ్ తాను గతంలో పోటీ చేసి ఓడిన మంగళగిరి నియోజకవర్గంలో సొంత నిధులతో సంజీవని వైద్య రధం.. సంజీవని ఆరోగ్య క్లీనిక్ లు ఏర్పాటు చేసారు.

బాలయ్య సొంత నిధులతో

బాలయ్య సొంత నిధులతో


తన నియోజకవర్గం పరిధిలో ఇంటి వద్దకే ఈ ఆరోగ్య రధం వెళ్లి.. కావాల్సిన వైద్య సేవలు అందిస్తుంది. నియోజకవర్గం మొత్తంగా ఇటువంటి సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాలా నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఇప్పుడు ఎమ్మెల్యే బాలయ్య కొత్త నినాదంతో హిందూపురంలో వైద్య సేవలు అందించేందుకు సిద్దమయ్యారు. నియోజకవర్గ ప్రజలకు ఉచిత వైద్యసేవలు అందించేందుకు ఎన్టీఆర్‌ ఉచిత ఆరోగ్య రథం సిద్ధం చేశారు. దీని ద్వారా 200 పైగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు, వైద్యుల సంప్రదింపులు, మాతాశిశు సంరక్షణ, ఆరోగ్య అవగాహన సదస్సులు గ్రామాల్లోనే ఏర్పాటు చేసే విధంగా రూ.40 లక్షల వ్యయంతో దీనిని నిర్వహించనున్నారు. ఈ రధం ఇప్పటికే హిందూపురం చేరుకుంది.

ప్రజల వద్దకే ఆరోగ్య సేవలు

ప్రజల వద్దకే ఆరోగ్య సేవలు

ఈ వాహనంలో ఒక వైద్యుడు, నర్సు, ఫార్మసిస్ట్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌, ఆరుగురు వైద్య సిబ్బంది, మందుల కౌంటర్‌ ఉంటాయి. సాధారణ వ్యాధులకు అక్కడే వైద్యం అందించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తారు. బాలయ్య ఈ వాహనాన్ని ప్రారంభించనున్నారు. ఇక్కడ అందించే సేవలు కంటే మరింత మెరుగైన వైద్యం అవసరమని భావిస్తే.. పెద్ద ఆసుపత్రులకు సిఫార్సు చేస్తారు. ఈ వాహనం రోజూ ఒక గ్రామానికి వెళ్లనుంది. ఇక, ఈ వాహనం పైన అందరికీ ఆరోగ్యమస్తు.. ప్రతి ఇంటికీ శుభమస్తు.. మన హిందూపురం, మన బాలయ్య అంటూ చిత్రీకరించిన విధానం ఆసక్తి కరంగా మారుతోంది. వచ్చే ఎన్నికల్లో హిందూపురం నుంచి బాలయ్య పోటీ చేస్తారా..లేక మరో నియోజకవర్గానికి మారుతారా అనే చర్చ కొద్ది రోజులుగా స్థానికంగా వినిపిస్తోంది.

హ్యాట్రిక్ కొట్టాలనే లక్ష్యంతో

హ్యాట్రిక్ కొట్టాలనే లక్ష్యంతో


వచ్చే ఎన్నికలు టీడీపీకి ప్రతిష్ఠాత్మకం కావటంతో..బాలయ్యను మరో కీలక నియోజకవర్గం నుంచి బరిలోకి దింపుతారనే చర్చ పార్టీలో నడుస్తోంది. అయితే, వరుసగా రెండు సార్లు ఇక్కడ నుంచి గెలిచిన బాలయ్య..ఇక్కడే మూడో సారి పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అందులో భాగంగానే.. సామన్య ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ఈ కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు బాలయ్య ప్రారంభిస్తున్న ఈ వైద్య సేవలకు ఎటువంటి స్పందన వస్తుందనేది చూడాలి.

English summary
MLA Balakrishna decided to start medical services for poor people in HIndupur with his own funds.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X