సొంత నియోజకవర్గంలో బాలకృష్ణకు చేదు అనుభవం...ఎందుకొచ్చారంటూ నిలదీసిన ప్రజలు
టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు చేదు అనుభవం ఎదురైంది. ఎందుకొచ్చారంటూ హిందూపురం నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే బాలకృష్ణను నిలదీశారు. చాలా కాలం తరువాత సొంత నియోజకవర్గానికి వచ్చిన బాలకృష్ణను స్ధానికులు అడ్డుకున్నారు. బాలకృష్ణ రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత నియోజకవర్గంలో అభివృద్ది జరిగింది ఏమీ లేదని వారు చెబుతున్నారు.
ఇదే సమయంలో సినిమాలతో తమ ఎమ్మెల్యే బిజీగా మారిపోయారని నియోజకవర్గ ప్రజలు బాలకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పండగలు, పెళ్లిళ్లకు రావడం తప్పిస్తే ఆయన నియోజకవర్గం వైపు కన్నేత్తి చూడటం లేదని ఆరోపిస్తున్నారు. హిందూపురం నియోజకవర్గం టీడీపీకి కంచుకోట వంటిది. ముఖ్యంగా నందమూరి కుటుంబానికి అచొచ్చిన నియోజకవర్గం.

టీడీపీ వ్యవస్ధాపకుడు ఎన్టీఆర్, ఆయన తనయుడు హరికృష్ణ ఇక్కడ నుంచే ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. వీరి తరువాత బాలకృష్ణ 2014,2019 వరుస ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే రెండోసారి విజయం సాధించిన తరువాత ఎమ్మెల్యే బాలకృష్ణ తమను పూర్తిగా గాలికి వదిలేశారని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. కనీస అవసరాలు తీర్చడంలో ఎమ్మెల్యే పూర్తిగా ఫెయిల్ అయ్యారని వారు అంటున్నారు.ఈ సమయంలోనే బాలకృష్ణ హిందూపురం రావడం జరిగింది.
— Vikatakavi (@vikatakavi1231) November 16, 2023
బాలకృష్ణ దాదాపు 9 నెలల తరువాత నియోజకవర్గానికి వచ్చారు.టిడిపి కన్వీనర్ అశ్వత్ రెడ్డి కుమార్తె పెళ్లి రిసెప్షన్‌కు ఆయన హాజరయ్యారు. ఈ విషయం తెలుసుకున్న కొందరు బాలకృష్ణ చుట్టుముట్టారు. కేవలం పెళ్లిళ్లు పేరంటాలకే వస్తారా అంటూ బాలయ్యను నిలదీశారు. బాలకృష్ణ రాకను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వెంటనే అలెర్ట్ అయిన పోలీసులు ప్రజలను సముదాయించి అక్కడ నుంచి పంపించారు. దీంతో వివాదం సద్దుమణిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.












Click it and Unblock the Notifications