చింతమనేని Vs అబ్బయ్య చౌదరి - ముదురుతోంది..!!
దెందులూరు నియోజకవర్గంలో మరోసారి రాజకీయ టెన్షన్ పెరుగుతోంది. టీడీపీ - వైసీపీ నేతల మధ్య ఆధిప్యత పోరు కొనసాగుతోంది. ఎమ్మెల్యే చింతమనేని.. మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మధ్య నువ్వా నేనా అన్నట్లుగా వర్గ పోరు పతాక స్థాయికి చేరింది. తాజాగా అబ్బయ్య చౌదరి మద్దతు దారుల పైన చింతమనేని అనుచిత వ్యాఖ్యలు..ఆ తరువాత ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వైసీపీ వర్గీయుల ఆందోళనతో నియోజకవర్గంలో రాజకీయ పోరుత తీవ్ర స్థాయికి చేరుకుంది.
పొలిటికల్ వార్
దెందులూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మధ్య రాజకీయ వివాదం పీక్ కు చేరింది. వట్లూరులోని ఓ ఫంక్షన్ హాల్లో వీరి మధ్య రాజుకున్న వివాదం నియోజకవర్గ స్థాయి దాటి రాష్ట్రస్థాయిలో చర్చగా మారుతోంది. ఈ వివాదం పైన ఎమ్మెల్యే చింతమనేని.. మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య ఒకరి పైన మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. వైసీపీ నేతల వ్యవహార శైలి పైన ముఖ్యమంత్రి .. డిప్యూటీ సీఎం కు ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే చింతమనేని చెప్పుకొచ్చారు. తమ ఉనికి కాపాడుకోవడానికి సంచలనాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.

చింతమనేని వార్నింగ్
వైసీపీ నేతలు ఇలాగే చేస్తే తాము చూస్తూ ఊరుకోనే పరిస్థితి లేదు. ఘటనపై విచారణ చేపట్టి కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ చెప్పారు. తాను ఆగ్రహంతో బరస్ట్ అయిన మాట వాస్తవమేనని అంగీకరించారు. తన కారుకు అబ్బయ్య చౌదరి డ్రైవర్ తమ కారును అడ్డంపెట్టి, తన డ్రైవర్‌ను, తన వాళ్లను తిడితేనే తాను తీవ్రంగా స్పందించానని చెప్పుకొచ్చారు. మీరు ఏం చేసినా మేము చూస్తూ కూర్చోవాలా అంటూ నిలదీసారు. మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పైన తీవ్ర స్థాయిలో చింతమనేని మండిపడ్డారు. ఏలూరు జిల్లా వట్లూరులో ఓ వివాహ కార్యక్రమానికి దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హాజరయ్యారు.
రాజకీయ ఉత్కంఠ
అక్కడ చింతమనేని కారుకు అడ్డంగా అబ్బయ్య చౌదరి కారు పెట్టటంతో వివాదం మొదలైంది. కారు తీయమని చెప్పినా వినకపోవడంతో ఆగ్రహానికి గురైనట్లు చింతమనేని చెబుతున్నారు. కాగా, ఆ కాసేపటికే చింతమనేని ప్రయాణిస్తున్న కారును వైసీపీ శ్రేణులు చుట్టు ముట్టారు. ఈ ఘటనపై ఏలూరు మూడో పట్టణ పోలీసులకు చింతమనేని డ్రైవర్ సుధీర్ ఫిర్యాదు చేశారు. ఇనుప రాడ్లతో తనతో సహా ఎమ్మెల్యే, గన్‌మెన్‌పై దాడి చేశారని తెలిపాడు. దీంతో, ఇప్పుడు చింతమనేని - అబ్బయ్య చౌదరి మధ్య రాజకీయ పోరు నువ్వా నేనా అన్నట్లుగా మారటంతో.. ఉద్రిక్తతలు పెరగ కుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications