పవన్ తెలియదంటారా? ఎంత అహంకారం: ఆశోక్ గజపతిపై జనసేనాగ్రహం

ప్రముఖ సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎవరో తనకు తెలియదని వ్యాఖ్యానించిన కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుపై జనసేన నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విజయవాడ: ప్రముఖ సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎవరో తనకు తెలియదని వ్యాఖ్యానించిన కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుపై జనసేన నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ ఎవరో తెలియదని అశోక్ గజపతిరాజు చెప్పడం సిగ్గు చేటని జనసేన నేత పోతిన వెంకట మహేష్ ఒక ప్రకటనలో తెలిపారు.

పవన్ వల్లే మీ గెలుపు

పవన్ వల్లే మీ గెలుపు

2014 ఎన్నికల్లో అశోక్ ఎంపీగా గెలిచేందుకు పవన్ కళ్యాణే కారణమని ఆయన అన్నారు. అంతకు ముందు ఎన్నికల్లో విజయనగరం ప్రజలు చిత్తుగా ఓడించిన సంగతిని గుర్తుచేసుకోవాలని ఆయనకు హితవు పలికారు.

అహంకారంతోనే..

అహంకారంతోనే..

అంతేగాక, అశోక్ గజపతిరాజులో రాచరికపు అహంభావ పోకడలు ఇంకా పోలేదని మహేష్ మండిపడ్డారు. పవన్ పై ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే... రాష్ట్ర ప్రజలు ఆయనకు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

పవన్ తెలియదని..

పవన్ తెలియదని..

పవన్ కళ్యాణ్ ఎవరో తనకు తెలియదంటూ ఇటీవల కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ద్వారకా తిరుమలలో పర్యటించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఆయనెవరో నాకు ఐడియా లేదు. అందరూ అంటున్నారు ఎవరో సినిమావాడట.. నేను సినిమాలు చూసి చాలా ఏళ్లైంది. సినిమాల గురించి మాట్లాడితే నేనేం చెప్పను' అని పవన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

అసహనం వ్యక్తం చేస్తూ..

అసహనం వ్యక్తం చేస్తూ..

టీటీడీ ఈవోగా ఉత్తరాదికి చెందిన ఐఏఎస్ అధికారిని నియమించడంపై పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్‌పై ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. ఆయన అసహనం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ఎవరో తనకు తెలియదని మరోసారి స్పష్టం చేశారు. దీంతో పవన్ అభిమానులు, జనసేన నేతలు, కార్యకర్తలు.. అశోక్ గజపతిరాజుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+