పవన్ దమ్ముంటే నాపై పోటీ చేయ్, బేరం కుదరకే - ద్వారంపూడి సవాల్..!!
జనసేనాని పవన్ కల్యాణ్ పైన కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి ఫైర్ అయ్యారు. పవన్ కల్యాణ్ నిజంగా జనసేన అధినేత అయితే..తన పైన కాకినాడలో పోటీ చేసి గెలవాలని సవాల్ చేసారు. పవన్ చేసిన ఛాలెంజ్ స్వీకరిస్తున్నానని.. కాకినాడలో పవన్ ను తుక్కుతుక్కుగా ఓడిస్తానని..లేకపోతే తన పేరు చంద్రశేఖరరెడ్డే కాదని చెప్పుకొచ్చారు. తన పైన పవన్ గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని..లేకపోతే పవన్ తప్పుకోవాలని ఛాలెంజ్ చేసారు. పవన్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేసారు.
పవన్ కు దమ్ముంటే పోటీ చేయి:కాకినాడ సభలో ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి పైన పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా వేడి పెంచాయి. పవన్ వ్యాఖ్యలపైన ద్వారంపూడి ఒక రేంజ్ లో స్పందించారు. పవన్ కల్యాణ్ ను నమ్మి పార్టీలోకి వచ్చిన వారెవరూ ఇప్పుడు లేరని..తనతో తొలి నుంచి ఉన్న వారు ఇంకా కొనసాగుతున్నారని వ్యాఖ్యానించారు.

వంగవీటి రంగా..జక్కంపూడి శిష్యుడిగా ఈ రోజు ఎమ్మెల్యే అయ్యానని చెప్పారు. మూడు సార్లు పోటీ చేసి రెండు సార్లు గెలిచానని..పవన్ రెండు చోట్ల పోటీ చేసి ఓడారని ఎద్దేవా చేసారు. సినిమాల్లో హీరో అయిన పవన్ రాజకీయంగా నీవు జీరో అన్నారు. మూడు నెలల క్రితం పవన్ కల్యాణ్ స్వయంగా తనకు సీఎంగా అయ్యే అర్హత లేదు..సింగిల్ గా పోటీ చేస్తే గెలవలేమని చెప్పారని గుర్తు చేసారు.
కాకినాడలో నీ వళ్ల కాదు:తరువాత చంద్రబాబుతో సమావేశమైన సమయంలో బేరం కుదరలేదన్నారు. దీంతో తనను సీఎం చేయమని..తనను ఎమ్మెల్యే చేయమని వేడుకుంటున్నారని ద్వారంపూడి వ్యాఖ్యానించారు. పవన్ ప్రస్తుతం కాకినాడలో ఉన్నారని..దమ్ముంటే జనసేన అధినేతవి అయితే..
నిజమైన పవన్ కల్యాణ్ అయితే కాకినాడలో తన పైన పోటీ చేయాలని ద్వారంపూడి సవాల్ చేసారు. చిత్తుచిత్తుగా ఓడిస్తానని హెచ్చరించారు. చంద్రబాబుతో జరిగిన సమావేశంలో ప్యాకేజీ సీట్ల బేరం కుదరక మాట మార్చారని చెప్పుకొచ్చారు.పవన్ కంటే తాను పెద్ద మీటింగ్ లు పెట్టాగలనని చంద్రశేఖర రెడ్డి పేర్కొన్నారు. సామాజిక వర్గాల పరంగా కాకినాడలో బలం లేకపోయినా..మూడు సార్లు పోటీ చేసి రెండు సార్లు గెలిచానని ద్వారంపూడి వివరించారు.
ఇదే నా హీరోయిజం:రెండు సార్లు గెలవటమే తన హీరోయిజమని ద్వారంపూడి చెప్పుకొచ్చారు. తనను ఓడించటం పవన్ వలన కాదన్నారు. బేడీలు వేసి కొట్టేస్తానని చెప్పటానికి సినిమాల్లో బాగుంటుదని చెప్పుకొచ్చారు. తన ఇంటి పైకి దాడికి వస్తే తాను చూస్తూ కూర్చోనని తేల్చి చెప్పారు.

పరిటాల రవి లాంటి వాళ్లు గుండు కొట్టించారని వ్యాఖ్యానించారు. పవన్ ఎమ్మెల్యే..సీఎం అయ్యేది సినిమాల్లోనేనని..తానే ఆ విధంగా సినిమా తీసుకొని చూసుకోవాల్సిందేనని ఎద్దేవా చేసారు. నీవు ప్యాకేజీ స్టార్..సినిమాల్లో మాత్రమే నీకు సాధ్యం అంటూ పవన్ పై కామెంట్స్ చేసారు. తాను వేట కోట్లు అవినీతికి పాల్పడ్డానని ఆరోపించారని..తన వద్ద ఆ డబ్బే ఉంటే ప్యాకేజీ స్టార్ పవన్ ను తానే కొనేవాడినని..సీట్లు ఇప్పించే వాడినని ద్వారంపూడి వ్యాఖ్యానించారు.
వాళ్లతో చేతులు కలిపావు:చంద్రబాబుకు ఇదే చివరి ఎన్నికలు అని చెప్పిన ద్వారంపూడి..ఆయనకు పెద్ద న్యాయమూర్తి మద్దతు ఉండేదన్నారు. జగన్ ఏ నిర్ణయాలు తీసుకున్నా ఆయన అడ్డుకొనే వారన్నారు. పవన్ మాటల్లోనే హీరో అని..తాము చేతల్లో చూపిస్తామని హెచ్చరించారు.
రాబోయే రోజుల్లో పవన్ సంగతి చూస్తానని చెప్పారు. వంగవీటి రంగాను హత్య చేసిన వారితో పవన్ చేతులు కలిపారని ద్వారంపూడి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. రెడ్డి సామాజిక వర్గం అంటే పవన్ కు అలుసుగా కనిపిస్తున్నారని ద్వారంపూడి వ్యాఖ్యానించారు. కాకినాడలో పోటీ చేసి గెలవాలనే ఛాలెంజ్ పైన పవన్ ఏ రకంగా స్పందిస్తారో చూడాలి.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్












Click it and Unblock the Notifications