ఓ నటికి కడుపుచేసి.. రూ.5 కోట్లు ఇచ్చాడు.. పవన్‌పై గ్రంథి హాట్ కామెంట్స్
పవన్ కల్యాణ్ వర్సెస్ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం పీక్‌కి చేరింది. వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పవన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్ వింత వ్యక్తిత్వం అని విమర్శించారు. రాజమండ్రిలో కానిస్టేబుళ్లను తిట్టిన నోటితోనే, అనంతపురం వెళ్లి మా నాన్న కూడా కానిస్టేబుల్ అంటారని కామెంట్ చేశారు. గతంలో ఓ సినీ నటికి అబార్షన్ చేయించి, ఐదు కోట్ల రూపాయలతో వ్యవహారం సద్దుమణిగేలా చేశాడని చెప్పుకుంటున్నారని హాట్ కామెంట్స్ చేశారు. ఆయనకు ముగ్గురు భార్యల ఉన్న విషయం మాత్రమే బయటికి తెలుసని, తెలియకుండా ఇంకెంతమంది ఉన్నారోనని ఎద్దేవా చేశారు.
గతంలో పవన్ తన అస్థికలను దేశమంతా చల్లితే తనలాంటివాళ్లు జన్మిస్తారనడం సిగ్గుపడాల్సిన విషయమని, జనసైనికులు, వీరమహిళలు అంత చేతగానివాళ్లా? అని గ్రంథి శ్రీనివాస్ ప్రశ్నించారు. పవన్ ఎప్పుడెలా ఉంటాడో, ఎలా మాట్లాడతాడో ఎవరికీ తెలియదని విమర్శించారు. రెండ్రోజులు రాష్ట్రంలో తిరిగాడంటే అల్లకల్లోలమే అని విరుచుకుపడ్డారు.

రాష్ట్రమంత్రిని సన్నాసి అంటూ పవన్ కామెంట్ చేయడం సిగ్గుచేటని అన్నారు. పవన్ ఎంతటి సంస్కారవంతుడే ఆయన మాటలే చెబుతున్నాయన్నారు. మంత్రి సన్నాసి అయితే పవన్ కళ్యాణ్ సన్నాసిన్నర సన్నాసి అంటూ తీవ్ర పదజాలంతో రెచ్చిపోయారు. పవన్ కళ్యాణ్ రెండ్రోజులు రాష్ట్రమంతా పర్యటిస్తే అంతా అల్లకల్లోలం అయిపోతుందని గ్రంధి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. రాజకీయ పార్టీని అడ్డం పెట్టుకుని జన సైనికులను అసాంఘిక శక్తులుగా మారుస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు.
Recommended Video
పవన్ కళ్యాణ్ ఎక్కడ, ఎప్పుడు, ఎలా మాట్లాడతారో ఆయనకే తెలీదని, ఆయనతో వింత క్యారెక్టర్ అని గ్రంధి శ్రీనివాస్ విమర్శించారు.పవన్ కళ్యాణ్‌కి ముగ్గురు భార్యలని మాత్రమే బయటి ప్రపంచానికి తెలుసని, తెలియకుండా ఇంకెంతమంది ఉన్నారో.. అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఓ హీరోయిన్‌ను గర్భవతిని చేసి రూ.5కోట్లిచ్చి అబార్షన్ చేయించాడనే ప్రచారం కూడా ఉందని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలని.. ఆయన ఒక్క మాటంటే తాము వంద మాటలు అంటామని శ్రీనివాస్ హెచ్చరించారు. గమ్మన ఉండాలని హితవు పలికారు.












Click it and Unblock the Notifications