స్వచ్ఛ ఆంధ్రలో ఎమ్మెల్యే, రాహుల్‌కు చిరు స్వాగతం
విజయవాడ: కృష్ణా జిల్లాలోని విజయవాడలో ఆదివారం ఏర్పాటు చేసిన స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, మేయర్ కోనె శ్రీధర్ పాల్గొన్నారు. తూర్పు, మధ్య నియోజకవర్గాల్లో నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో డ్రెయినేజీలో చెత్త తొలగింపు, కాలువగట్టు, రోడ్లు శుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు.
నగరంలోని 59 డివిజన్ల కార్పోరేటర్లు, నగర పాలక సంస్థ అధికారులు, సిబ్బంది ఉదయం నుండి స్వచ్ఛంధంగా తరలి వచ్చి నగరాన్ని శుభ్రం చేశారు. స్వచ్ఛ ఆంధ్ర పైన నగరవాసులకు అవగాహన కల్పించారు.
విశాఖకు రాహుల్ గాంధీ

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విశాఖ చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయంలో రాహుల్ కు ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి, ఎంపీ కేవీపీ రామచంద్రరావులు స్వాగతం పలికారు. తుపాను బాధితులను పరామర్శించేందుకు రాహుల్ విశాఖ వచ్చారు.
రోడ్డు ప్రమాదంలో ప్రేమికుల దుర్మరణం

అనంతపురం నుంచి రాప్తాడుకు వచ్చిన ప్రేమజంట రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ద్విచక్రవాహనం డివైడర్‌ను ఢీకొట్టి ప్రేమికులు నవీన్(24), అంజలి(21) మృతి చెందారు. ఈ విషాద ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. అనంతపురానికి చెందిన నవీన్ కుమార్- అంజలి గతకొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఏకాంతంగా గడిపేందుకు అనంతపురం నుంచి రాప్తాడు వచ్చి దుర్మరణం చెందారు.
సాలూరులో బాణసంచా పేలి ఇద్దరి మృతి
టపాసులు కాల్చాలన్న సరదా రెండు నిండు ప్రాణాలను బలిగొంది. దీపావళికి గోడబాంబులు తయారు చేయాలని బాణసంచా సామగ్రి కొనుగోలు చేసిన ఇద్దరు యువకులు బాంబులు తయారు చేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా మరో ఐదుగురికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
విజయనగరం జిల్లా సాలూరులోని బిరుసు అప్పలస్వామి మేడపై గోడ బాంబులను తయారు చేసేందుకు అనిల్, కామేష్‌లు శనివారం ఉదయం మందుగుండు సామగ్రి తీసుకెళ్లారు. టపాసులతయారీని చూసేందుకు కామేష్ తమ్ముడు గణేష్ కూడా మేడపైకి వెళ్లాడు. గణేష్‌తో పాటు మరో ముగ్గురు సుధీర్, మధు, ప్రదీప్‌లు కూడా మేడపైన చదువుకునేందుకు పుస్తకాలు తీసుకుని వెళ్లారు. వీరందరితో పాటు గోక సతీష్ కూడా అక్కడే ఉన్నాడు.
అదే సమయంలో పెద్దపెద్ద శబ్దాల తో బాణసంచా ముడి సామగ్రి పేలింది. ఈ ప్రమాదంలో అనిల్(17), గణేష్(9)లు తీవ్రగాయాలతో స్పృహతప్పగా, కామేష్, సతీష్‌లు చెల్లాచెదురుగా పడి ఉన్నారు. సుధీర్, మధు, ప్రదీప్‌లు స్వల్పగా యాలతో బయటపడ్డారు.












Click it and Unblock the Notifications