రోడ్డు ప్రమాదం: పోలీసుల అదుపులో ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కొడుకు

విజయవాడ: ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తనయుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ రోడ్డు ప్రమాదానికి కారణంగా చెబుతూ అతనిని వారు అదుపులోకి తీసుకున్నారు. జలీల్ ఖాన్ 2014లో వైసీపీ నుంచి గెలిచి, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

విజయవాడ పిన్నమనేని పాలీక్లినిక్‌ రోడ్డులో కారు బీభత్సం సృష్టించింది. ఈ కేసులో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ కుమారుడిని అదుపులోకి తీసుకొని విచారించారు. జలీల్‌ఖాన్‌ కుమారుడు సాహుల్‌ఖాన్‌ ప్రయాణిస్తున్న కారు బైక్‌ను ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.

MLA Jaleel Khan’s son involved in Vijayawada road accident

ఈ ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ కృష్ణతేజను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు ఎమ్మెల్యే కుమారుడు సాహుల్‌ఖాన్‌ కారులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ సమాచారం రావడంతో పోలీసులు అతనిని కూడా అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+