చర్యలు తీసుకోకుంటే రాజీనామా చేస్తా - టీడీపీ ఎమ్మెల్యే అల్టిమేటం..!!

ఏపీలో రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. హోరా హోరీగా ఎన్నికలను కూటమి.. వైసీపీ రెండు వైపులా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఇదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యే తాజాగా పార్టీకి అల్టి మేటమ్ జారీ చేసారు. పార్టీలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేత పైన చర్యలు తీసుకోకుంటే.. తాను ఎమ్మెల్యేగా ఉండి ఉపయోగం లేదని.. రాజీనామాకు సిద్దమంటూ చేసిన హెచ్చరిక ఇప్పుడు సంచలనంగా మారుతోంది.

రాజీనామాకు సిద్దం
టీడీపీలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి ఒక సంచలనం. ఎమ్మెల్యే సీటు దక్కించుకోవటం నుంచి గెలిచిన కొలికపూడి నిర్ణయాలు విమర్శలకు కారణమయ్యాయి. గతంలో మద్యం దుకాణా లు.. ఒక సర్పంచ్ భార్య ఆత్మహత్యాయత్నం వంటి విషయాల్లో పార్టీ నాయకత్వం ఎమ్మెల్యే నుంచి వివరణ కోరింది. పార్టీ క్రమశిక్షణా కమిటీ వద్ద హాజరైన ఎమ్మెల్యే తన వాదన వినిపించారు. టీడీపీ లోని ఇతర నేతలతో ఎమ్మెల్యేకు సత్సంబంధాలు లేవని చెబుతున్నారు. ఇదే సమయంలో తాజాగా కొలికపూడి అల్టిమేటం జారీ చేసారు. మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ రమేశ్ రెడ్డి పైన స్థానిక ప్రజలు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసారు. రమేశ్ రెడ్డి పైన పార్టీ 48 గంటల్లోగా చర్యలు తీసుకోకుంటే రాజీనామా చేస్తానని కొలికపూడి సంచలన ప్రకటన చేసారు.

mla-kolikapudi-ultimatum-for-party-demands-action-against-ramesh-reddy

చర్యలు తీసుకోకుంటే
రమేశ్ రెడ్డి పైన అనేక ఫిర్యాదులు ఉన్నాయి. స్థానిక గిరిజన మహిళతో అసభ్యకరంగా మాట్లాడిన అంశం వైరల్ అయింది. దీంతో, వారంతా ఎమ్మెల్యే వద్ద తమ ఆవేదన వెలిబుచ్చారు. స్పందించి న ఎమ్మెల్యే ఇప్పటి వరకు రమేశ్ రెడ్డి పైన ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. లోన్ కోసం ఒక అమ్మాయి ఫోన్ చేస్తే సమాజం సిగ్గుపడేలా అసభ్యకరంగా మాట్లాడారని మండిపడ్డారు. రమేశ్ రెడ్డికి విజయవాడ ఎంపీ కార్యాలయం లోని వారి నుంచి మద్దతు లభిస్తోందని చెప్పుకుంటు న్నారని పేర్కొన్నారు. చిన్ని ఆఫీసులోని కిషోర్ నాలుగు ట్రాక్టర్లు 50 లక్షలు ఇచ్చాను రమేష్ రెడ్డి అంటున్నారని.. తాను విచారిస్తే ఒక టాక్టర్ ఇచ్చిన మాట వాస్తవమని తేలిందని చెప్పుకొచ్చారు.

Take a Poll

పార్టీ నిర్ణయమేంటి
తాను తిరువూరు నియోజకవర్గం లో మొదటిసారి అడుగు పెట్టినప్పుడు తనను ఆశీర్వదించింది ఈ గిరిజన గ్రామాలేనని కొలికపూడి గుర్తు చేసారు. ఒక గిరిజన మహిళతో ఇంత అసభ్యంగా మాట్లా డిన రమేష్ రెడ్డి కనిపిస్తే తాను ఎలా స్పందిస్తానో వివరించారు. ఇక నైనా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని పార్టీ నుండి వెంటనే సస్పెండ్ చేయాలని కొలికపూడి డిమాండ్ చేసారు. ఇప్పుడు ఎంపీ కార్యాలయంలో సిబ్బంది పైన కొలికపూడి చేసిన వ్యాఖ్యలు పార్టీలో వైరల్ అవుతున్నాయి. మరి.. టీడీపీ నాయకత్వం కొలికపూడి డిమాండ్ పైన ఏ విధంగా స్పందిస్తుందో అనేది జిల్లా పార్టీ శ్రేణుల్లో ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+