పవన్ కల్యాణ్ ను లోకేష్ క్షమాపణ కోరారా..!!
ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. వైసీపీలో ఇంఛార్జ్ ల మార్పు పైన సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో టెన్షన్ పెరుగుతోంది. ఇటు టీడీపీ , జనసేన పొత్తులో ముందుకు వెళ్తున్న వేళ లోకేష్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పవన సీఎం కావాలని కోరుకుంటున్న వారికి లోకేష్ వ్యాఖ్యలు రుచించటం లేదు. ఇదే సమయంలో పవన్ పైన కాపు నేతల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఈ సమయంలోనే మరో అంశం చర్చకు వచ్చింది.
లోకేష్ వ్యాఖ్యలపై: పవన్ కల్యాణ్ సీఎంగా ఛాన్స్ లేదంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యల పైన మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. హరిరామ జోగయ్య ..జనసైనికులకు అర్దం కావటం లేదని..పవన్ స్వయంగా తాను సీఎం కావటం కోసం కాదు..చంద్రబాబును సీఎం చేయటం కోసమే తాను పని చేస్తున్నానని చెప్పారని గుర్తు చేసారు.

చంద్రబాబుతో నాలుగు గోడల మద్య జరిగిన సమావేశంలోనూ అదే హామీ ఇచ్చారనేది ఇప్పుడు లోకేష్ వ్యాఖ్యలతో స్పష్టత వచ్చిందని వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల సమయంలో లోకేష్‌ను దొంగ అని తిట్టి.. ఇప్పుడెందుకు వాళ్లకు ఓటేయమని పవన్ ఎలా అడుగుతున్నారని ప్రశ్నించారు. తన తల్లిని దూషించారని నాడు ఆవేదన వ్యక్తం చేసిన పవన్..ఇప్పుడు లోకేష్ కు మద్దతుగా నిలవటం ఏంటని..లోకేష్ క్షమాపణ చెప్పారా అంటూ పేర్నినాని నిలదీసారు.
అట్టర్ ప్లాప్ సినిమా: సంక్షేమ పథకాలతో రాష్ట్రం శ్రీలంక అవుతుందని విమర్శించారని పేర్ని నాని గుర్తు చేసారు. అలా విమర్శించిన వారే ఇప్పుడు మూడురెట్లు ఎక్కువ సంక్షేమం అందిస్తామంటున్నారని ఎద్దేవా చేసారు. అధికారం కోసం చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తమను పాలేరులు అని తిట్టిన పవన్ ఇప్పుడు ఎవరికి పాలేరుగా పనిచేస్తున్నారని ప్రశ్నించారు.
ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు, లోకేష్, పవన్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. నారా లోకేష్‌ది అట్టర్ ప్లాప్ యాత్ర అని సెటైరికల్ కామెంట్స్ చేశారు, నారా లోకేష్ అట్టర్ ప్లాప్ సినిమా. అది పాదయాత్ర కాదు.. జంపింగ్ జపాంగ్ యాత్ర అంటూ నాని పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసమే మొక్కుబడి యాత్ర చేశారని ఎద్దేవా చేసారు.
చుక్కలు కనిపిస్తున్నాయి: జనసేనకు 25 సీట్లే ఇస్తున్నామని టీడీపీ చెబుతోందని వివరించారు. కండువాల్లో తేడా తప్ప పవన్‌తో సహా అక్కడున్న అందరూ టీడీపీనేనని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, లోకేష్, పవన్ ఎక్కడి వారు.. ఎక్కడ పోటీ చేసారని నాని ప్రశ్నించారు.
2014 నుంచి 2019 వరకూ మహిళలకు ఫ్రీ బస్సు ఎందుకివ్వలేదని నిలదీసారు. ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న పొలిటికల్ వ్యూహాలతో చంద్రబాబుకు చుక్కలు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. సీఎం జగన్‌లాగా చంద్రబాబు ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేరని నాని చెప్పుకొచ్చారు.
-
పట్టు చిక్కుతున్న వేళ చంద్రబాబు చేతికి జగన్ మరో అస్త్రం, సెల్ఫ్ గోల్..!! -
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
పవన్ ఉగ్రరూపం: ఎమ్మెల్యేలకు లాస్ట్ వార్నింగ్, ఇక యాక్షన్ తప్పదు -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..!












Click it and Unblock the Notifications