ముఖేష్ అంబానీ, చంద్రబాబులపై వైసిపి ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు
చిత్తూరు: రూ.500, రూ.1000 నోట్ల వ్యవహారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీలాంటి వాళ్లకు ముందే తెలుసునని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా సోమవారం నాడు ఆరోపించారు.
ముందే తెలిసినందువల్ల చంద్రబాబు, అంబానీ లాంటివాళ్లు జాగ్రత్తపడి సర్దుకున్నారని చెప్పారు. సామాన్యుడు మాత్రం ఈ నిర్ణయంతో అనేక బాధలు పడుతున్నారన్నారు. డబ్బుకోసం గంటల పాటు బ్యాంకుల వద్ద క్యూలో నిలబడాల్సి వస్తోందన్నారు.

అంతసేపు క్యూలో నిలిచుకున్నా కౌంటర్ వద్దకు వచ్చేసరికి ఉంటుందో లేదో అర్థం కాని పరిస్థితి అన్నారు. చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి నేడు డబ్బులు కూడా లేని పరిస్థితి ఎదురైందన్నారు.
కాగా, ప్రధాని మోడీ పెద్ద నోట్లు రద్దు చేయడం మంచి నిర్ణయమైనా సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రోజా ఆదివారం పేర్కొన్నారు. పుత్తూరు పట్టణ ఎస్‌బీఐలో క్యూలైన్లను చూసిన రోజా.. బ్యాంకులోకి వెళ్లింది. ఈ సందర్భంగా ఆమె బ్రాంచి మేనేజరు డీవీ లక్ష్మీతో మాట్లాడారు.
కనీసం రూ.100, రూ.50లు తీసుకోవాలన్నా ప్రతి రోజు క్యూలో నిలబడాల్సి వస్తోందన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూలో నిలబడినా చివరివారికి నగదు అయిపోతోందని, దీంతో తిరిగి మరుసటి రోజు క్యూలో నిలబడాల్సి వస్తోందన్నారు.
బయటి పిల్లలకు తల్లిదండ్రులు బ్యాంకుల్లో నగదు జమ చేయాలన్నా అవస్థలు పడుతున్నారన్నారు. బ్యాంకర్లు ఆలోచించాలన్నారు. ఏటీఎంలలో తగినంత నిల్వలు పెట్టాలన్నారు. బ్రాంచి మేనేజరు డీవీ లక్ష్మీ మాట్లాడుతూ.. చెన్నై నుంచి రూ.10లక్షలు నగదు ప్రతిరోజు ఇస్తున్నారని, అయితే అది చాలడంలేదన్నారు. తమ చేతుల్లో ఏం లేదన్నారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు.
-
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !!












Click it and Unblock the Notifications