దమ్మున్న మగాడేనా?: చంద్రబాబుపై రోజా తీవ్ర వ్యాఖ్యలు(వీడియో)
మహిళా పార్లమెంటేరియన్ సమావేశానికి ఆహ్వానించి, అరెస్ట్ చేయడమేంటని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు.
విజయవాడ: మహిళా పార్లమెంటేరియన్ సమావేశానికి ఆహ్వానించి, అరెస్ట్ చేయడమేంటని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. గన్నవరం విమానాశ్రయంలో తనను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై రోజా తీవ్రంగా మండిపడ్డారు. మహిళలను రానివ్వకుండా మహిళా సదస్సులు నిర్వహిస్తున్నారని ధ్వజమెత్తారు.
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కూతురు, సీఎం చంద్రబాబునాయుడు కోడలు, తెలంగాణ సీఎం కూతురులను ఆహ్వానించుకునేందుకు ఇదేమైనా రాజకీయ సమావేశమా? అని ఆమె నిలదీశారు. చంద్రబాబుకు భయం పట్టుకుందని అన్నారు.
చంద్రబాబు దమ్మున్న మగవాడే అయితే.. బృందా కారత్ లాంటి మహిళా నేతలతోపాటు తనలాంటి వారిని పిలిపించి సదస్సులో మాట్లాడనివ్వాలని అన్నారు. ఇంత పిరికివాళ్లు, భయపడేవాళ్లను చూడలేదని అన్నారు. కోట్లు ఖర్చు చేసి సమావేశాలు ఏర్పాటు చేసింది మహిళల కోసమేనా? అని ప్రశ్నించారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాను గన్నవరం విమానాశ్రయంలో శనివారం పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. బౌద్ధ గురువు దలైలామా అక్కడకు వస్తున్నారన్న కారణంతోనే ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ నేతలు ఫైర్
చంద్రబాబుకు రోజాను ఎదుర్కొనే ధైర్యం లేదని వైయస్సార్ కాంగ్రెస్ మహిళా నేతలు ఈశ్వరీ, తదితరులు ఆరోపించారు. చంద్రబాబు భయపడాల్సిన అవసరం లేదని, ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్ మండిపడ్డారు. ఈ ఘటనపై డీజీపీని నిలదీస్తామని చెప్పారు.
-
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ












Click it and Unblock the Notifications