పవన్ కల్యాణ్ పై రోజా సంచలన వ్యాఖ్యలు.. మండిపడుతున్న అభిమానులు

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై రోజా చేసిన వ్యాఖ్యలపై ఆయన అభిమానులు మండిపడుతున్నారు. పవన్‌పై రకరకాలుగా విమర్శలు చేయడం రోజాకు అలవాటుగా మారిందని వారు పేర్కొంటున్నారు.

అమరావతి: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై రోజా చేసిన వ్యాఖ్యలపై ఆయన అభిమానులు మండిపడుతున్నారు. సహజంగానే రోజా నోటికి అడ్డూ అదుపూ ఉండదు. నోటికి ఎంతొస్తే అంత.. ఎలాపడితే అలా మాట్లాడేయడం ఆమె నైజం.

ఇటీవల ఓ మీటింగ్‌లో రోజా మాట్లాడుతూ పవన్‌ కల్యాణ్ ను దారుణంగా అవమానించింది. ఏపీకి ప్రత్యేక హోదా పేరెత్తితే పవన్ ఎందుకు పారిపోతున్నారంటూ ప్రశ్నించిందామె.

pawan-roja

ఏ ప్యాకేజీ ఆశించి పవన్ ఇలా పారిపోతున్నారో చెప్పాలంటూ బహిరంగంగానే నిలదీసింది. పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ కాదని, కేంద్రంతో పోరాడే శక్తిలేని రబ్బర్ సింగ్‌ అని విమర్శించింది.

మరోచోట కూడా మాట్లాడుతూ పవన్‌కు చిత్తశుద్ధి లేదని రోజా విమర్శించింది. ఒంటరిగా ప్రత్యేక హోదా కోసం పోరాడే దమ్ములేకపోతే జగన్ పోరాటానికి మద్దతు ఇవ్వాలని కూడా సూచించింది.

జనసేన తలాతోక లేని పార్టీగా ఆమె అభివర్ణించింది. కాపు సోదరులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తుంటే పవన్ ఎక్కడికి వెళ్లారని ఏకంగా కులం కార్డును కూడా వాడుతూ ఒక సభలో రోజా విమర్శలు చేశారు.

రోజా వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ అభిమానులు మండిపడుతున్నారు. అవకాశం ఉన్న ప్రతి సభలోనూ పవన్‌పై రకరకాలుగా విమర్శలు చేయడం రోజాకు అలవాటుగా మారిందని, జనాకర్షణ కోసమే ఆమె ఈ విధంగా మాట్లాడుతోందని వారు పేర్కొంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+