ఎన్యుమరేటర్‌గా ఎమ్మెల్యే: దత్తాత్రేయ వివరాల నమోదు
హైదరాబాద్: సమగ్ర సర్వేలో భాగంగా జిల్లా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు శ్రీనివాస్‌గౌడ్ ఎన్యూమరేటర్‌గా వ్యవహరించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో పలు ఇళ్లకు వెళ్లిన సర్వే చేసిన ఎమ్మెల్యే ఆ వివరాలను పత్రాల్లో నింపారు. ఆయన తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
కాగా, బిజెపి పార్లమెంటు సభ్యుడు బండారు దత్తాత్రేయ తన కుటుంబ వివరాలను సమగ్ర సర్వేలో భాగంగా నమోదు చేశారు. హైదరాబాదులోని రాంనగర్‌లో ఎన్యుమరేటర్లకు తన కుటుంబ వివరాలను అందించారు.

నల్గొండ జిల్లాలో జరిగిన సమగ్ర సర్వేలో కాంగ్రెసు ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి తన కుటుంబ సభ్యుల వివరాలను ఎన్యూమరేటర్లకు అందజేశారు. తెలంగాణ సమగ్ర సర్వేలో ఇతర ప్రాంతాల్లో స్థిర పడ్డ వారు కూడా తమ పేరును నమోదు చేసుకోవడం వల్ల సంక్షేమ పథకాలు నిరుపయోగమయ్యే అవకాశం ఉందన్నారు. ఈ సర్వే కారణంగా నిజమైన లబ్ది దారుడికి అన్యాయం జరగడానికి వీలులేదన్నారు. వారసత్వంగా వచ్చిన ఆస్తికి సంబంధించి సర్వేలో వివరాలు నమోదు చేసే క్రమంలో కుటుంబాల మధ్య ఇబ్బందికర పరిస్థితులు రాకుండా చూడాలని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి సూచించారు.

సమగ్ర సర్వేలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ వివరాలను అందజేశారు. హైదరాబాద్ సమీపంలోని రాజేంద్రనగర్‌లోని తన నివాసానికి వచ్చిన ఎన్యూమరేటర్లకు స్వామిగౌడ్ కుటుంబ వివరాలను అందజేశారు.
హిజ్రాల వివరాలను కూడా ఎన్యుమరేటర్లు సేకరించారు. తమ వివరాలను కూడా సర్వేలో నమోదు చేసినందుకు వారు ఆనందం వ్యక్తం చేశారు.
-
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్












Click it and Unblock the Notifications