ఎక్కువగా మాట్లాడితే డొక్క తీసి డోలు కడతాం - వల్లభేని వంశీ మాస్ వార్నింగ్..!!
తనపైనా..కొడాలి నాని పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలకు వల్లభనేని వంశీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన వ్యతిరేకులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. మాజీ మంత్రి కొడాలి నాని..వల్లభనేని వంశీ పైన గన్నవరం వైసీపీ నేతలు యార్లగడ్డ వెంకటరావు..దుట్టా రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేసారు. వారి విద్యార్హతతో పాటుగా ఆస్తులకు సంబంధించి ఆరోపణలు చేసారు. కొడాలి నాని గురించి అనుచిత వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు పార్టీలో కలకలం రేపుతోంది. ఈ వ్యాఖ్యల పైన ఎమ్మెల్యే వంశీ సీరియస్ గా స్పందించారు. ఎవరిని ఎలా డీల్ చేయాలో తమకు బాగా తెలుసని చెప్పారు. ఎక్కువగా మాట్లాడితే డొక్క తీసి డోలు కడతామని హెచ్చరించారు.

గన్నవరం నేతల సీరియస్ వ్యాఖ్యలు
నెల్లూరు జిల్లా వైసీపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో గన్నవరం రాజకీయాలు హీటెక్కాయి. టీడీపీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీ వైసీపీకి దగ్గరైన సమయం నుంచి ఆ నియోజకవర్గ పు వైసీపీ నేతలు యార్లగడ్డ వెంకటరావు..దుట్టా రామచంద్రరావులు ఇద్దరూ ఆగ్రహంతో ఉన్నారు. వంశీ పార్టీలోకి రావటాన్ని వారిద్దరూ వ్యతిరేకిస్తున్నారు. వంశీతో పాటుగా ఆయనకు మద్దతుగా నిలుస్తున్న మాజీ మంత్రి కొడాలి నానికి సంబంధించి ఈ ఇద్దరు నేతలు ప్రయివేటు సంభాషణల్లో చేసిన వ్యాఖ్యలు దుమారానికి కారణమవుతున్నాయి. ఈ ఇద్దరి వ్యాఖ్యల పైన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సీరియస్ అయ్యారు. పనీ పాట లేని వాళ్లు ఏదో ఒకటి మాట్లాడుతారంటూ ఫైర్ అయ్యారు. నియోజకవర్గంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని వ్యాఖ్యానించారు.

వ్యతిరేకించే నేతలకు వంశీ వార్నింగ్
పనీ పాట లేని వాళ్లు ఏదో మాట్లాడుతూ ఉంటారని వ్యాఖ్యానించారు. వాళ్లిద్దరూ చేసిన వ్యాఖ్యలను పార్టీ అధినాయకత్వానికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదని వంశీ చెప్పుకొచ్చారు. వార్డుకు..పంచాయితీకి గెలవలేని వాళ్లు తనకు సహకరించకపోతే ఏమీ కాదని ధీమా వ్యక్తం చేసారు. తనను..నాని పైన వ్యాఖ్యలు చేస్తే పెద్ద వాళ్లం అవుతామని భావిస్తున్నారని చెప్పుకొచ్చారు. గమ గురించి ఎక్కువ మాట్లాడితే డొక్క తీసి డోలు కడతామని వల్లభనేని వంశీ వార్నింగ్ ఇచ్చారు. టీడీపీలో ఉన్న సమయంలో తాను..కొడాలి నాని ఎలా ఉన్నాయో..వైసీపీలోనూ తమ స్టైల్ అలాగే ఉంటుందని చెప్పుకొచ్చారు. కళ్ళు చిదంబరం అద్దం ముందు నిలబడి మహేష్ బాబు అనుకుంటే అయిపోతారా అంటూ వంశీ ఆ ఇద్దరు నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

హైకమాండ్ సీరియస్..కీలక నిర్ణయం దిశగా
నియోకవర్గంలో ఏం జరుగుతుందో చూడమని చెప్పిన వంశీ.. క్లైమాక్స్ ముందే చెబితే సినిమా ఎవరూ చూడరని చెప్పుకొచ్చారు. తాను గన్నవరం కోసం ఏం చేసానో తనకు తెలుసని.. అక్కడి ప్రజలకు తెలుసని చెప్పారు. వలస పక్షలుకు ఏం తెలుస్తుందని వ్యాఖ్యానించారు. యార్లగడ్డ వెంకటరావు..దుట్టా రామచంద్రరావు ఇద్దరూ కొడాలి నాని..వంశీ పైన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వ్యాఖ్యల పైన స్పందించిన దుట్టా రామచంద్రరావు వచ్చే ఎన్నికల్లో గన్నవరం అభ్యర్ధి వంశీ అయితే తాము సహకరించేది లేదని స్పష్టం చేసారు. ఇప్పటికే పార్టీ నాయకత్వం వంశీ అభ్యర్ధిగా ప్రకటించింది.
దీంతో..ఇప్పుడు గన్నవరం వైసీపీ నేతల పంచాయితీ పైన పార్టీ నాయకత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications