భగీరథుడు, మహాత్ముడు: బాబుపై ప్రశంసల జల్లు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గురువారం నాడు టిడిపి శాసనసభ్యులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై ప్రశంసల జల్లు కురిపించారు. మహా భగీరధుడు అని, అద్భుత మైన ఆలోచనలు చంద్రబాబునాయుడుకు ఎలా వస్తాయో ఆశ్చర్యంగా ఉందని, ఆయనను కొంతకాలం తర్వాత మహాత్ముడిగా గుర్తుపెట్టుకుంటారంటూ టిడిపి వారన్నారు. బడ్జెట్‌పై జరిగిన చర్చలో గౌతు శ్యాం సుందర శివాజీ, గొల్లపల్లి సూర్యారావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్ తదితరులు మాట్లాడారు.

తొలుత గౌతు శ్యాం సుందర శివాజీ మాట్లాడుతూ - విపక్ష నేతలు స్పీకర్ స్థానాన్ని ఉద్ధేశించి అంటున్న మాటలు దారుణమని అన్నారు. ఒకపుడు తమ సీట్ల నుండి ఒక్క అడుగు కూడా ముందుకు వేసేవారు కాదని, ఒక వైపు స్పీకర్ ఇచ్చిన సమాన అవకాశాలను వినియోగించుకుంటూ సభాపతిపై ఆరోపణలు ఎంత వరకూ భావ్యమని అన్నారు. సభలో తను తప్ప మరెవరూ మాట్లాడరాదనే ఆలోచనలు సరికాదని అన్నారు. మాటల్లో చెప్పే నీతి ఆచరణలోనూ, చేతల్లోనూ ఉండటం లేదని అన్నారు.

MLAs praise Chandrababu in Andhra Pradesh assembly

చిన్నా పెద్దా లేకుండా దారుణంగా విపక్ష సభ్యులు వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తున్నారని గొల్లపల్లి సూర్యారావు అన్నారు. ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ విపక్ష సభ్యులు రన్నింగ్ కామెంట్రీ చేస్తున్నారని అది అత్యంత దురదృష్టకరమని చెప్పారు. దారిద్య్ర నిర్మూలన , అసమానతలను తొలగించడం, ఆరోగ్యకర సంతోషదాయక రాష్ట్రం ఏర్పాటు వంటి బృహత్తర లక్ష్యాలను పెట్టుకుని ప్రభుత్వం పనిచేస్తుంటే, చంద్రబాబునాయుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తుంటే దానిని భరించలేక ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

రాష్ట్ర విభజన జరిగిన విధానం హేతుబద్ధంగా లేదని, అయినా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలుపుతున్న చంద్రబాబునాయుడు మహాత్ముడు అని అన్నారు. గొప్ప గొప్ప ఆలోచనలు ఆయనకు ఎలా వస్తున్నాయో అర్ధం కావడం లేదని చెప్పారు, విద్యుత్ సంస్కరణలు, నీటిపారుదల ప్రాజెక్టుల పూర్తి వంటి బృహత్‌కార్యక్రమాలను చేపట్టారని అన్నారు. రాష్టబ్రడ్జెట్ వాస్తవానికి దగ్గరగా ఉందని, అంకెల గారడీ చేయకుండా రాష్ట్రాన్ని నిలబెట్టేందుకు ఆర్ధిక మంత్రి ఎన్నో చర్యలుచేపట్టారని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+