చంద్రబాబు హీరో... జగన్‌, పవన్‌ విలన్లు: జగన్ యూటర్న్ లు...పవన్ రాజకీయాల్లో నటన:బుద్ధా వెంకన్న

విజయవాడ:అభివృద్ధి అనేది సినిమా అనుకుంటే...ఆ సినిమాలో చంద్రబాబు హీరో అని...జగన్‌, పవన్‌ విలన్లు అని టిడిపి ఎమ్మెల్సీ వెంకన్న వ్యాఖ్యానించారు. మంగళవారం విజయవాడలో స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌లో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

Recommended Video

    జగన్ నోట మోడీ మాట: కళా వెంకట్రావు

    ప్రజల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ధర్మపోరాటం చేస్తూ మంచి రోడ్లు వేస్తుంటే, జగన్‌ మాత్రం స్వార్ధ రాజకీయాల కోసం యూటర్న్ లు తీసుకుంటున్నారన్నారు. మూడు రోజుల క్రితం కాపు రిజర్వేషన్లపై జగన్‌ పిఠాపురంలో మాట్లాడిన మాటలు చూస్తే ఆయన యూటర్న్‌ తీసుకున్నట్లు అర్థమవుతోందన్నారు. ఇక పవన్‌ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్ధం కాదని బుద్దా వెంకన్న ఎద్దేశా చేశారు.

    MLC Buddha Venkanna fire over Jagan and Pawan Kalyan


    కాపుల రిజర్వేషన్‌పై బిల్‌ పాసు చేసి కేంద్రానికి పంపిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న స్పష్టం చేశారు. కాపు కార్పొరేషన్‌కు పది వేల కోట్లు ఇస్తామని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కాపు కార్పొరేషన్‌ ను ఎందుకు ఏర్పాటు చేయలేదని బుద్దా వెంకన్న నిలదీశారు.

    పవన్‌ కళ్యాణ్ రాజకీయాల్లో నటిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబును విమర్శించడం పవన్‌కు తగదని హితవు పలికారు. రాష్ట్ర అభివృద్ధికి 33 వేల ఎకరాలు అవసరమేనని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు. 2019లో మళ్లీ చంద్రబాబే సీఎం అని...జగన్‌కు డిపాజిట్లు కూడా రావని, జనసేనకు అసలు అభ్యర్ధులే దొరకరని ఆయన బుద్దా వెంకన్న జోస్యం చెప్పారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+