కారణమిదే: ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి సస్పెన్షన్ ఎత్తివేతకు రంగం సిద్దం?
నెల్లూరు: నెల్లూరు టిడిపి ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేసే అవకాశాలున్నాయని టిడిపి వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఈ మేరకు కొందరు టిడిపి నాయకులు పార్టీ నాయకత్వానికి వాకాటి నారాయణరెడ్డిపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కోరారని సమాచారం.
కాంగ్రెస్ పార్టీ నుండి టిడిపిలో చేరిన వెంటనే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాకాటి నారాయణరెడ్డి విజయం సాధించారు.ఎమ్మెల్సీగా విజయం సాధించిన తర్వాత ఆయనపై సిబిఐ కేసు నమోదైంది.
వ్యాపారాల విషయంలో బ్యాంకులను మోసం చేశారనే ఆరోపణలతో వాకాటి నారాయణరెడ్డిపై టిడిపి ఇటీవల కాలంలో సస్పెన్షన్ విధించింది. ఈ కేసు విషయమై అసలు విషయాలు వెలుగుచూసిన తర్వాత సస్పెన్షన్‌పై నిర్ణయం తీసుకోవాలని టిడిపి నాయకత్వం భావించింది.

అయితే నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశఆలున్న దృష్ట్యా వాకాటి నారాయణరెడ్డిపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని నెల్లూరు జిల్లాకు చెందిన కొందరు టిడిపి నేతల పార్టీ నాయకత్వాన్ని కోరారని ప్రచారం సాగుతోంది.
వాకాటి నారాయణరెడ్డి టిడిపిలో కొనసాగితేనే సూళ్ళూరుపేట నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కానుందని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని సస్పెన్షన్ ఎత్తివేయాలని పార్టీ నాయకత్వాన్ని కోరారని సమాచారం.
ఈ సస్పెన్షన్ ఎత్తివేత విషయమై ఇంకా పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకోలేదు. అయితే సస్పెన్షన్ ఎత్తివేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే అభిప్రాయం తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఉంది.












Click it and Unblock the Notifications