ఫోన్ పోయిందా.. కంగారొద్దు.. సులువుగా దొరుకుతుంది
ఇకనుంచి ఫోన్ పోయిందని కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ట్రాకింగ్ సిస్టమ్ ఇకపై దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. పోయిన ఫోన్‌ని ట్రాక్ చేసి బ్లాక్ చేసేందుకు కొత్త సిస్టమ్ అందుబాటులోకి వస్తోంది. ఈమేరకు ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. సెంటర్ ఫర్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలిమాట్రిక్స్(CDoT) అభివృద్ధి చేసిన 'సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్( CEIR)' వ్యవస్థను ఈనెల 17 నుంచి అమలు కానుంది. సీడాట్ సీఈఓ రాజ్ కుమార్ ఉపాధ్యాయ్ మాత్రం ఇంకా తేదీని ధ్రువీకరించలేదు.
అన్ని టెలికాం నెట్ వర్క్స్ లో క్లోనింగ్:ప్రస్తుతం CEIR వ్యవస్థను కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్ర, నార్త్ ఈస్ట్ రీజియన్‌లతో సహా కొన్ని టెలికాం సర్కిల్స్ లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. తాజాగా ఈ వ్యవస్థను దేశవ్యాప్తంగా విస్తరించబోతున్నారు. ఈ ఏడాది సెప్టెంబరు నాటికి దేశం మొత్తం అందుబాటులోకి వస్తుందని ఉపాధ్యాయ్ వ్యాఖ్యానించారు. అన్ని టెలికాం నెట్ వర్క్స్ లో క్లోనింగ్ చేసిన సెల్ ఫోన్ల వినియోగాన్ని చెకింగ్ చేసేలా ఫీచర్లుంటాయన్నారు.

IMEI నెంబరు ముందే చెప్పాలి..:దేశంలో విక్రయించే మొబైల్ ఫోన్లలో IMEI-15 అంకెల ప్రత్యేక ఐడెంటిటీ నెంబర్ ను ముందే తెలియజేయాల్సి ఉంటుంది. ప్రతి మొబైల్ నెట్ వర్క్ ఈ నెంబరును యాక్సిస్ చేసే అవకాశం లభించనుంది. అనధికారిక మొబైళ్లు తమ నెట్ వర్క్ పరిధిలోకి వస్తే వెంటనే ఈ CEIR వ్యవస్థ ద్వారా గుర్తిస్తారు. IMEI నెంబరును మొబైల్ నెంబర్లతో అనుసంధానిస్తారు. ఫోన్లను ట్రాక్ చేయడం, బ్లాక్ చేయడం అంతా ఈ సమాచారం ఆధారంగా జరుగుతుంది. దీనివల్ల ఫోన్ల దొంగతనాలు తగ్గుతాయని భావిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా ఫోన్ ను అపహరించినా పోలీసులకు గుర్తించడం సులువవుతుంది.












Click it and Unblock the Notifications