సెల్‌ఫోన్లలోకి అశ్లీల చిత్రాలు పంపిస్తున్న ఓనర్ అరెస్ట్

టాస్క్ ఫోర్స్ పోలీసుల కథనం ప్రకారం... ఖైరతాబాద్‌లోని చింతల్ బస్తీ ప్రాంతానికి చెందిన ఎంకెఎం మొబైల్స్ కేంద్రం నిర్వాహకుడు మహమ్మద్ సాధిక్ మోహియుద్దీన్ అనే 29 ఏళ్ల యువకుడు సెల్‌ఫోన్ల మెమోరీ కార్డుల్లోకి తన కంప్యూటర్ల నుండి అశ్లీల చిత్రాలను పంపిస్తూ అమ్ముకుంటున్నాడు.
అతడి కార్యకలాపాల పైన సమాచారం రావడంతో టాస్క్ ఫోర్స్ ఇన్సుపెక్టర్ భాస్కర్ నేతృత్వంలో పోలీసులు బుధవారం సోదాలు నిర్వహించారు. ఈ సోదాల అనంతరం మోహియుద్దీన్‌న అదుపులోకి తీసుకున్నారు. ల్యాప్‌టాప్‌తో పాటు రూ.4,720 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరి అరెస్ట్
క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్న ఇద్దరిని తూర్పు మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుండి రూ.30వేల నగదు, ఆరు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను విచారణ నిమిత్తం అఫ్జల్ గంజ్ పోలీసులకు అప్పగించారు.












Click it and Unblock the Notifications