రామ్మోహన్నాయుడు, శ్రావ్యలను ఆశీర్వదించిన మోడీ

న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు వివాహ విందు దేశరాజధాని న్యూఢిల్లీలో బుధవారం రాత్రి వైభవంగా జరిగింది. స్థానిక హోటల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హజరై రామ్మోహన్‌నాయుడు, శ్రావ్యలను ఆశీర్వదించారు.

మోడీ ఆశీర్వాదం

మోడీ ఆశీర్వాదం

మోడీతోపాటు కేంద్ర మాజీ మంత్రి వెంకయ్యనాయుడు తన కుటుంబసభ్యులతో కలిసి హాజరయ్యారు. కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, ప్రకాశ్‌జావడేకర్‌, సురేశ్‌ప్రభు, తోమర్‌, పీయూష్‌గోయెల్‌, అశోక్‌గజపతిరాజు, సుజనాచౌదరిలతోపాటు టీడీపీ, టీఆర్ఎస్, వైయస్సార్ కాంగ్రెస్,బీజేపీతోపాటు పలు పార్టీలకు చెందిన వందలాది మంది ఎంపీలు విందుకు హాజరయ్యారు.

రిసెప్సన్‌లో డ్యాన్స్ అదరగొట్టిన రామ్మోహన్నాయుడు

రిసెప్సన్‌లో డ్యాన్స్ అదరగొట్టిన రామ్మోహన్నాయుడు

గత కొద్ది రోజుల క్రితం వివాహానికి ముందు సంగీత్ ఘనంగా జరిగింది. ఎంపీ రామ్మోహన్ నాయుడు ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసి సందడి చేశారు. ఎన్టీఆర్ 'బాద్‌షా'లోని 'బంతిపూల జానకి' పాటకు ఎంపీ రామ్మోహన్ అదిరిపోయే స్టెప్పులేశారు. ఆ వీడియో వైరల్‌గా మారింది.

Recommended Video

    Venkaiah Naidu Wear Dhoti (Panche Kattu) Only, Why? | Oneindia Telugu
    ఏయూలో వివాహం

    ఏయూలో వివాహం

    రామ్మోహన్నాయుడు, శ్రావ్యల వివాహం ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో జరిగింది. విశాఖపట్నం జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ద్వితీయ పుత్రిక శ్రావ్యను రామ్మోహన్ నాయుడు వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

    చంద్రబాబు హాజరు

    చంద్రబాబు హాజరు

    కాగా, జూన్ 14న రాత్రి రిసెప్షన్ జరిగింది. జూన్ 15వ తేదీ తెల్లవారుజామున 03.01 గంటల శుభ ముహూర్తానికి రామ్మోహన్నాయుడు, శ్రావ్యల వివాహం ఘనంగా జరిగింది. ఎంపీ వివాహం, విందు కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే బాలకృష్ణతోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+