శ్రీకాళహస్తిలో మోడీ, పవన్ కళ్యాణ్, బాబు (పిక్చర్స్)
తిరుమల/శ్రీకాళహస్తి: ప్రచారంలో ఊపేసిన ముగ్గురు నాయకులు గురువారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్‌కల్యాణ్, బిజెపి నేత వెంకయ్యనాయుడు స్వామివారి సేవలో పాల్గొన్నారు.
శ్రీవారిని దర్శించుకుని తూర్పు మాడవీధిలో నడచి వస్తుండగా ఓ వృద్ధుడు భద్రతావలయాన్ని చేధించుకుంటూ మోదీ వద్దకు వచ్చి 'మీరు ప్రధాని కావాలి' అంటూ ఆయన పాదాలపై పడటానికి ప్రయత్నించారు. ఒక్కసారిగా ఆందోళనకు గురైన పోలీసులు వెనువెంటనే అప్రమత్తమై ఆ వృద్ధుడిని పట్టుకుని పక్కకు తీసుకొచ్చారు.
ఆ తర్వాత హెలికాప్టర్‌లో శ్రీకాళహస్తికి చేరుకుని రాహు-కేతు సర్పదోష నివారణ పూజలు చేయించుకున్నారు. అనంతరం వారు గురువారం రాత్రి వరకు ఐదు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు.

శ్రీకాళహస్తిలో మోడీ
శ్రీకాళహస్తిలో బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి ఇలా స్వాగతం లభించింది. గురువారంనాడు మిగతా నాయకులతో కలిసి శ్రీకాళహస్తిని సందర్శించారు.

శ్రీకాళహస్తిలో మోడీ బృందం
శ్రీకాళహస్తిలో బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి పూలమాల వేసి స్వాగతం చెబుతున్న దృశ్యం. పక్కన సీనియర్ నేత వెంకయ్యనాయుడు.

శ్రీకాళహస్తిలో మోడీ
తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత మోడీ బృందం శ్రీకాళహస్తి చేరుకుంది. శ్రీకాళహస్తిలో మోడీ ఇలా...

శ్రీకాళహస్తిలో మోడీ
శ్రీకాళహస్తిలో నరేంద్ర మోడీ రాహువు కేతువు పూజ నిర్వహించారు. ఆ తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లతో కలిసి ప్రచారానికి వెళ్లారు.

శ్రీకాళహస్తిలో పవన్ కళ్యాణ్
నరేంద్ర మోడీ, చంద్రబాబులతో పాటు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ శ్రీకాళహస్తి చేరుకున్నారు.

రాహువు, కేతు పూజ
శ్రీకాళహస్తిలో నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రాహువు, కేతువు పూజలు నిర్వహించారు.

మోడీ, పవన్ జంటగా..
నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ రాహువు కేతువు పూజ సందర్భంగా శ్రీకాళహస్తిలో ఇలా కనిపించారు.

శ్రీకాళహస్తిలో పవన్ కళ్యాణ్
నరేంద్ర మోడీ, చంద్రబాబులతో పాటు పవన్ కళ్యాణ్ శ్రీకాళహస్తి వచ్చారు. ఆ సందర్భంగా ఆయన గురువారంనాడు ఇలా కనిపించారు.

ఒకే దండలో చంద్రబాబు, మోడీ..
శ్రీకాళహస్తిలో నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు ఒకే పూలదండ కింద ఇమిడిపోయారు. ఇలా సన్మానం జరిగింది.

చంద్రబాబుతో పవన్ కళ్యాణ్
విభేదాలను మరిచిపోయి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసిపోయారు. శ్రీకాళహస్తిలో వారిద్దరు ఇలా కనిపించారు.












Click it and Unblock the Notifications