• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బుందేల్ ఖండ్ దెబ్బ: కేంద్రంపై కాదు.. బాబుపై పెరిగిన ఒత్తిడి, తేల్చుకుంటారా? లేక

|

అమరావతి: ఈ ఏడాది ఆఖర్లో అక్కడ ఎన్నికలున్నాయి కాబట్టి బుందేల్‌ఖండ్‌పై ప్రధానికి మోడీకి ప్రేమ పొంగుకొచ్చినట్టుంది. ఉన్నపళంగా ఆ రాష్ట్రానికి భారీ తాయిలాలే ప్రకటించారు. రూ.20వేల కోట్ల వరాల జల్లు కురిపించారు. ఆ రాష్ట్రానికి వరాలు కురిపించడం పట్ల అభ్యంతరం లేదు కానీ.. నాలుగేళ్లుగా ప్యాకేజీ నిధుల కోసం నెత్తీ నోరు బాదుకుంటున్న ఏపీ సంగతేంటి? అన్నదే ప్రశ్న. మోడీ పుణ్యమాని ఇప్పుడు చంద్రబాబు మరింత ఇరుకునపడ్డారు కూడా..

    No Confidence Motion : Better To Take Chance By Which Party ?

    'ముగిసిన అధ్యాయం' మళ్లీ తెరుస్తున్నారు: బాబులో అలజడి, అందుకే ఉన్నపళంగా..

    బాబుపై తీవ్ర ఒత్తిడి:

    బాబుపై తీవ్ర ఒత్తిడి:

    కేంద్రంలో మిత్రపక్షంగా ఉంటూ రాష్ట్రానికి ఏమి సాధించలేకపోయారన్న అపప్రదను మూటగట్టుకుంటున్నారు సీఎం చంద్రబాబు. అటు ప్రత్యక్ష పోరాటానికి దిగలేక.. అలా అని భవిష్యత్తుపై భరోసా ఇవ్వలేక.. చంద్రబాబు ఇప్పుడు సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. బుందేల్ ఖండ్ పై వరాల తర్వాత.. కేంద్రంపై ఒత్తిడేమో కానీ చంద్రబాబుపై మాత్రం ఒత్తిడి తీవ్రతరమయ్యే సూచనలే ఉన్నాయి.

    బుందేల్ ఖండ్‌పై మోడీ వరాల జల్లు.. రూ.20 వేల కోట్ల ప్యాకేజ్, రక్షణ కారిడార్

    ఇప్పటికైనా తాడో పేడో?..:

    ఇప్పటికైనా తాడో పేడో?..:

    అవిశ్వాసం ఆఖరి అస్త్రమంటూ చంద్రబాబు చేసిన ప్రకటన.. కేంద్రంపై ఆయన ప్రత్యక్ష పోరాటానికి ఎంతమాత్రం సిద్దంగా లేరన్న సంకేతాలు పంపించింది. మరోవైపు నిధులు ఇవ్వకపోతే వదిలిపెట్టను అంటూ ఆయన చేస్తున్న ప్రకటనలు కేవలం కవ్వింపు చర్యలు గానే కనిపిస్తున్నాయి తప్ప.. అంత విశ్వసనీయంగా అనిపించడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే టీడీపీకి నష్టమే తప్ప లాభం లేదు కాబట్టి.. ఇప్పటికైనా చంద్రబాబు తాడో పేడో తేల్చుకోవాలంటున్నారు ప్రజలు.

    మోడీ చిన్నచూపు..:

    మోడీ చిన్నచూపు..:

    అటు మోడీని చూస్తే.. అసలు చంద్రబాబును లెక్క చేస్తున్నట్టే కనిపించడం లేదు. రాష్ట్రంలోని పార్టీలు, ప్రజా సంఘాలన్ని హోదాపై ప్రత్యక్ష పోరాటానికి సిద్దమవుతున్న తరుణంలోనూ.. ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదు. ఎటొచ్చి ఏపీలో బీజేపీకి పెద్దగా భవిష్యత్తు లేదు కాబట్టే రాష్ట్రంపై ఆయన చిన్న చూపు అలాగే కొనసాగుతోందంటున్నారు.

    బాబు ఏం చేస్తారో!:

    బాబు ఏం చేస్తారో!:

    బుందేల్‌ఖండ్‌పై వరాలు కురిపించి.. అదే సమయంలో ఏపీని విస్మరించి మోడీ తన వైఖరేంటో మరోసారి స్పష్టంగా చాటుకున్నారు. చంద్రబాబు పట్ల ఉన్న అలసత్వమో.. లేక రాష్ట్రం పట్ల చిన్న చూపో గానీ మొత్తానికి ఆయన రాష్ట్రంపై దృష్టి సారించే అవకాశాలు కూడా కనిపించడం లేదు.

    పైగా బీజేపీ నేతలతో టీడీపీపై గట్టిగానే తిరుగుబాటు చేయిస్తున్నారు. వీటన్నింటిని గమనిస్తున్న చంద్రబాబు.. ఇప్పటికైనా బీజేపీని వీడి పోరాటానికి సిద్దమవుతారా?.. లేక ప్రజల్లో మరిన్ని అనుమానాలకు తావిస్తారా? అన్నది చూడాలి.

    తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

    English summary
    Andhra Pradesh Chief Minister Chandrababu Naidu has been facing severe criticism for his failure in putting pressure on Narendra Modi government to realise promises made in the AP Reorganisation Bill, 2014.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more