చిరంజీవిపై మోహన్ బాబు వ్యాఖ్యలు
చిరంజీవి (Chiranjeevi)తో తనకు ఎలాంటి విభేదాల్లేవని నటుడు మోహన్‌బాబు (MohanBabu) స్పష్టం చేశారు.
చిరంజీవి (Chiranjeevi)తో తనకు ఎలాంటి విభేదాల్లేవని నటుడు మోహన్‌బాబు (MohanBabu) స్పష్టం చేశారు. వీలున్నప్పుడల్లా తామిద్దరూ మాట్లాడుకుంటూనే ఉంటామని చెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మోహన్‌బాబుని చిరంజీవితో నెలకొన్న విభేదాలపై స్పందించమని కోరగా అందుకు మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వజ్రోత్సవాల్లో జరిగిన వివాదంపై స్పందించారు. తామిద్దరిపై సోషల్ మీడియాలో తరుచుగా ఇలాంటి వార్తలు వస్తుంటాయని, ఎప్పుడో జరిగిపోయినదాన్ని గురించి ఇప్పుడు ప్రస్తావించడం కూడా అనవసరమన్నారు. తామిద్దరం ఇప్పుడు సంతోషంగా ఉన్నామని, కొన్ని సందర్భాల్లో అన్నదమ్ములు, ఆత్మీయులు, స్నేహితుల మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరంలేదని చెప్పారు. ఇంటర్వ్యూలో ఆ విషయం గురించి వద్దని, మరేదైనా అడగాలని మోహన్ బాబు కోరారు.
''మా' ఎన్నికల సమయంలో మీ ఇద్దరి మధ్య ప్రతికూల వాతావరణం నెలకొన్నట్లు అందరూ అనుకున్నారు?'' అని విలేకరి ప్రశ్నించారు. ''ఆ బాధ ఇప్పటికీ తన మనసులో ఉందని, అలా ఎందుకు జరిగింది? అది తన తప్పా? చిరంజీవి తప్పా? అనేది ఇప్పుడు చర్చించాలనుకోవడం లేదని, తామిద్దరం వందసార్లు ఎదురుపడి మాట్లాడుకున్నామని, తమ మధ్య ఏదీ లేదని, తామిద్దరి మధ్య ఏదో ఉందని బయటివారు అనుకోవడమేనని తేల్చారు. మా ఎన్నికల్లో విజయం సాధించిన విష్ణు చక్కటి పనితీరు కనపరిచి చెప్పిన పనులన్నీ పూర్తిచేశాడని, కాకపోతే మా భవనం ఒక్కటే పెండింగ్ లో ఉందన్నారు. జిన్నా అనేది చక్కటి సినిమా అని, కానీ అది ఎందుకు విజయం సాధించలేకపోయిందో అర్థం కావడంలేదన్నారు. ఓటీటీలో ఆ సినిమా మంచి ఫలితాలు అందుకుందని మోహన్ బాబు అన్నారు.

తెలుగు చలనచిత్ర వజ్రోత్సవాల సందర్భంగా చిరంజీవి, మోహన్ బాబు మధ్య చోటుచేసుకున్న చిన్న ఘటన ఇంతింతై వటుడింతై అన్నట్లుగా.. వారిద్దరి మధ్య విభేదాలున్నట్లుగా ప్రచారం జరిగింది. మా ఎన్నికల సందర్భంగా చిరంజీవి మద్దతిచ్చిన ప్రకాష్ రాజ్ తో పోటీపడి మోహన్ బాబు కుమారుడు విష్ణు గెలిచారు. అప్పుడు కూడా చిరంజీవి, మోహన్ బాబు మధ్య వైరం నెలకొందంటూ జరిగిన ప్రచారాన్ని వీరిద్దరూ ఖండించారు.
-
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్












Click it and Unblock the Notifications